Home » పొన్నియిన్ సెల్వ‌న్ లో న‌టించిన ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా ?

పొన్నియిన్ సెల్వ‌న్ లో న‌టించిన ఈ చిన్నారి ఎవ‌రో తెలుసా ?

by Anji
Ad

సాధార‌ణంగా కొన్ని సినిమాలు సూప‌ర్ హిట్ సాధిస్తుంటాయి. మ‌రికొన్ని సినిమాలు అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంటాయి. కానీ చాలా సినిమాల్లో చిన్నారుల పాత్ర కీల‌కం కానుంది. తాజాగా పాన్ ఇండియా ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నం క‌ల‌ల ప్రాజెక్ట్‌గా వ‌చ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వ‌న్. ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్‌, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వ‌ర్య‌రాయ్‌, కార్తీ, త్రిష‌, జ‌యంర‌వి వంటి త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమా త‌మిళం, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళి భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల అయింది.

Advertisement

తొలి రోజే సూప‌ర్ హిట్ అందుకున్న ఈ సినిమాకి ఆడియ‌న్స్ నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌ముఖ ర‌చయిత క‌ల్కి ర‌చించిన ఈ పొన్నియిన్ సెల్వ‌న్ న‌వ‌ల ఆధారంగా ఈ సినిమాని తెర‌కెక్కించారు మ‌ణిర‌త్నం. కేవ‌లం మూడు రోజుల్లోనే ఈ చిత్రం రూ.230 కోట్ల‌కు పైగా రాబ‌ట్టి రికార్డు క్రియేట్ చేసింది. థియేట‌ర్ల‌లో చూస్తున్న ప్రేక్ష‌కుల క‌ళ్లు ఒక అమ్మాయిపై ఆగిపోయాయి. సినిమా మొత్తంలో ఆ అమ్మాయి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అనే చెప్పాలి. కొన్ని సెక‌న్ల వ్య‌వ‌ధిలోనే అంద‌రినీ త‌న‌వైపు ఆక‌ట్టుకుంటుంది. ఇంత‌కి ఎవ‌రో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

Also Read :  అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 టీజ‌ర్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా..?

పొన్నియిన్ సెల్వ‌న్ చిత్రంలో ఐశ్వ‌ర్య నందిని చిన్న‌నాటి పాత్ర‌లో న‌టించిన అమ్మాయి పేరు సారా అర్జున్‌. విక్ర‌మ్ త‌న ఫ్లాష్ బ్యాక్ వివ‌రిస్తున్న‌ప్పుడు సారా కేవ‌లం కొన్ని సెక‌న్ల పాటు క‌నిపించింది. ఆ కొద్ది స‌మ‌యంలోనే త‌న అందంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసింది. ఈ చిన్న‌ది మ‌రెవ్వ‌రో కాదు.. గ‌తంలో విక్ర‌మ్ న‌టించిన దాగుడు మూత‌లు దండాకోర్, జైహో, ఏక్ ల‌డ‌కీ కో దేఖాతో ఐసా ల‌గా వంటి చిత్రాల్లో న‌టించి మెప్పించింది. హిందీలో 404 సినిమాలో క‌థానాయికా న‌టిస్తూనే బాలీవుడ్ ఆరంగేట్రం చేయ‌నుంది. ఇప్ప‌టివ‌ర‌కు చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన సారా అక‌స్మాత్తుగా పొన్నియిన్ సెల్వ‌న్ సినిమాలో టీనేజ్ యువ‌తిగా క‌నిపించి ప్రేక్ష‌కుల‌ను ఒక్క‌సారిగా త‌న అందంతో క‌ట్టిప‌డేసింది. త్వ‌ర‌లోనే ఈ అమ్మాయి వెండితెర‌పై అగ్ర క‌థానాయిక‌గా రాబోతుందని టాక్ వినిపిస్తోంది.

Also Read :  ఆదిపురుష్ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Visitors Are Also Reading