Home » అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 టీజ‌ర్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా..?

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 టీజ‌ర్ వ‌చ్చేది ఎప్పుడో తెలుసా..?

by Anji
Ad

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇక ఆయ‌న అన్ స్టాప‌బుల్ షోతో అభిమానులే కాదు ప్రేక్ష‌కుల‌ను కూడా స‌ర్‌ప్రైజ్ చేశాడు . సాధార‌ణంగా ప‌లు టాక్ షోల‌కు రావ‌డానికే ఆలోచిస్తుంటాడు బాల‌కృష్ణ‌. అలాంటిది ఏకంగా టాక్ షోని హోస్ట్ గా వ్య‌వ‌హ‌రించాడు. ఆహా వేదిక‌గా స్ట్రీమింగ్ అయిన అన్‌స్టాప‌బుల్ షో ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌ర‌మే లేదు.

Advertisement

ప‌లువురు సెల‌బ్రెటీల‌తో బాల‌కృష్ణ చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఇండ‌స్ట్రీలో చాలా మంది బాల‌య్య‌ది చిన్న పిల్లాడి మ‌న‌స్థ‌త్వం అంటుంటారు. కానీ ఈ షోతో బాల‌య్య‌లో ఉన్న మ‌రో కోణాన్ని చూశాం. బాల‌య్య ఎంత స‌ర‌దా మ‌నిషి అనే విష‌యం ఈ షో ద్వారా చాలా మంది ప్రేక్ష‌కులకు తెలిసింద‌నే చెప్పాలి.

Also Read :  ఆదిపురుష్ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

Advertisement

అన్‌స్టాపబుల్ రెండో సీజ‌న్ స్టార్ట్ చేస్తున్న‌ట్టు ఆహా సంస్థ ఇటీవ‌లే ప్ర‌క‌టించిన విష‌యం విధిత‌మే. రెండో సీజ‌న్ ని గ్రాండియ‌ర్‌గా రూపొంచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే సీజ‌న్‌-2 ప్రారంభం కానుంది. ఇక ఇప్ప‌టికే సెల‌బ్రెటీల లిస్ట్ కూడా సిద్ధం చేశార‌ట‌. ఈ లిస్ట్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, చిరంజీవి, ప్ర‌భాస్‌, అనుష్క‌, త్రివిక్ర‌మ్ వంటి స్టార్లు రానున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ షో టీజ‌ర్ డేట్‌ను మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 టీజ‌ర్‌ను అక్టోబ‌ర్ 04న విజ‌య‌వాడ‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ షోను అ!, క‌ల్కి, జాంబిరెడ్డి వంటి చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

Also Read :  ఆ స్టార్ హీరో ని పెళ్లాడాల్సిన మంచు లక్ష్మి పరిస్థితి ఇలా కావడానికి కారణం ఆ ఒక్కటేనా..!!

Visitors Are Also Reading