Home » ఆదిపురుష్ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

ఆదిపురుష్ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర‌లో న‌టించింది ఎవ‌రో తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమాలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా టీజ‌ర్ ఎప్పుడు ఎప్పుడు వ‌స్తుందా అని ఎంతో ఆస‌క్తిగా దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను ఎదురు చూశారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 02న అయోధ్య‌లోని స‌ర‌యు నది తీరాన గ్రాండ్‌గా ఆదిపురుష్ టీజ‌ర్‌ని విడుద‌ల చేశారు. విడుద‌లైన కొద్ది సేప‌టికే ఈ టీజ‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో, కృతిస‌న‌న్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావ‌ణుడిగా న‌టిస్తున్నారు.

Advertisement

 

అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్ష‌కుల‌కు తెలుసు. వీరంద‌రూ గ‌తంలోనే అంద‌రికీ ప‌రిచ‌య‌మే. కానీ ఆదిపురుష్ టీజ‌ర్‌లో హ‌నుమంతుడు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాడు. ఇక ఇప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ప్ర‌ధాన పాత్ర‌ల‌ను మాత్ర‌మే ప‌రిచ‌యం చేసిన డైరెక్ట‌ర్ ఓంరౌత్ హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ్వ‌రూ న‌టిస్తున్నార‌నేది ప్ర‌క‌టించ‌లేదు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్‌లో హ‌నుమంతుడి పాత్ర‌లో ఎవ‌రు న‌టించారు అని నెటిజ‌న్లు వెత‌కడం ప్రారంభించారు. అయితే హ‌నుమంతుడి పాత్ర‌లో క‌నిపించిన అత‌ని పేరు దేవ‌ద‌త్త గ‌జాస‌న్ నాగే. మ‌రాఠీ సీరియ‌ల్స్, సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Advertisement

Also Read :  ఆ స్టార్ హీరో ని పెళ్లాడాల్సిన మంచు లక్ష్మి పరిస్థితి ఇలా కావడానికి కారణం ఆ ఒక్కటేనా..!!

ప్ర‌ధానంగా జై మ‌ల్హ‌ర్ సీరియ‌ల్‌లో లార్డ్ కండోబా పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు. అదేవిధంగా వీర్ శివాజీ, దేవ‌యాని, బాజీరావ్ మ‌స్తానీ వంటి చిత్రాల్లో న‌టించారు. ఇప్పుడు భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో అత‌ని పాత్ర చాలా కీల‌కంగా ఉండ‌నుంద‌ట‌. ద‌ర్శ‌కుడు ఓంరౌత్ తెర‌కెక్కించిన తాన్హాజీ, ది అన్ సంగ్ వారియ‌ర్ చిత్రంలో సూర్యాజీ మ‌లు స‌రే పాత్ర‌లో న‌టించారు. త‌న‌కు హ‌నుమంతుడితో ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని.. 17 ఏళ్ల వ‌య‌సులోనే తాను వ‌ర్క్ అవుట్ చేయ‌డం ప్రారంభించి త‌న తొలి జిమ్ సెంట‌ర్‌కి హ‌నుమాన్ వ్యాయామ శాల అని పేరు పెట్టిన‌ట్టు గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు దేవ‌ద‌త్తా. ఇక ఆదిపురుష్ సినిమా ద్వారా ప్ర‌భాస్‌, స‌న్నీసింగ్‌, కృతిస‌న‌న్ త‌న‌కు మంచి స్నేహితులు అయ్యార‌ని చెప్పుకొచ్చారు.

Also Read :  పాపం ప్రభాస్ దానినుండి ఎప్పుడు కోలుకుంటారో.. ఏమో..?

Visitors Are Also Reading