Telugu News » Blog » బాహుబలి 2 లో అనుష్క పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

బాహుబలి 2 లో అనుష్క పక్కన నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా?

by Bunty
Ads

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా సంచలన విజయం చోటు చేసుకుంది. బాహుబలి సినిమాను జక్కన్న రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో హీరోయిన్ లుగా అనుష్క, తమన్నాలు నటించారు. అంతేకాకుండా విలన్ గా రానా దగ్గుబాటి నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి పార్ట్ వన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత పార్ట్ 2 పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

READ ALSO : Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు

అందరి మనసులోనూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు అన్న ప్రశ్న మొదలైంది. ఇక పార్ట్ 2 లో ఆ ప్రశ్నకు కూడా సమాధానం దొరికింది. పార్ట్ 2 కూడా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ బాహుబలి 2 సినిమాలో అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు.

Advertisement

మరి అనుష్క పక్కన అదరగొట్టిన ఈ అమ్మాయి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో అనుష్క వదినగా నటించింది ఆశ్రిత వేముగంటి. కన్నా నిదురించరా పాటలో అద్భుతంగా డ్యాన్స్ కూడా చేసింది ఆశ్రిత వేముగంటి. బేసిగ్గా ఆశ్రిత క్లాసికల్ డాన్సర్. కూచిపూడి నేర్చుకుంది. ఇప్పటికే పలు దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఒక ప్రదర్శనలో ఆమెను చూసిన రాజమౌళి బాహుబలి సినిమాలో అవకాశం ఇచ్చాడు. సినిమా హిట్ అయి ఆశ్రిత వేముగంటికి మంచి పేరు తీసుకువచ్చింది. వైఎస్ఆర్ బయోపిక్ సినిమాలోను ఈ బ్యూటీ నటించింది. విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి నటించింది. ఇంకా చెప్పాలంటే విజయమ్మ పాత్రకు అచ్చు గుద్దినట్లు సరిపోయింది ఆశ్రిత.

Advertisement

READ ALSO : సౌందర్య చనిపోవడానికి ముందే ఆమెకు 3 ప్రమాదాలు జరిగాయి..కానీ కొంచెంలోనే ?