Home » Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు

Andrew Flintoff : ఆండ్రూ ఫ్లింటాఫ్ కు యాక్సిడెంట్.. హెలికాఫ్టర్ లో తరలింపు

by Bunty
Ad

ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అండ్రు ఫ్లింటాఫ్ గురించి తెలియని వారు ఉండరు. 2007 టి20 ప్రపంచ కప్ లో యువరాజ్ సింగ్ ను రెచ్చగొట్టినందుకు అండ్రు ఫ్లింటాఫ్ ప్రతి భారత అభిమానికి గుర్తుండిపోయాడు. అండ్రు ఫ్లింటాఫ్ తన గొంతు కోస్తానని బెదిరించాడని యువి కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత యువి ఆడిన తుఫాన్ సిక్సులను ప్రపంచం మొత్తం చూసింది.

Read also : 17, 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్లు !

Advertisement

స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒకే ఓవర్ లో సిక్స్ సిక్సర్లు బాదాడు. అయితే, అలా యువరాజ్ సింగ్ ను రెచ్చగొట్టిన ఫ్లింటాఫ్ కు తాజాగా యాక్సిడెంట్ అయింది. అండ్రు ఫ్లింటాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అండ్రు ఫ్లింటాఫ్ కారు రోడ్డు ప్రమాదం కు గురైంది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే అండ్రు ఫ్లింటాఫ్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ప్రస్తుతం అతడు లండన్ లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Advertisement

‘టాప్ గేర్’ షో ఎపిసోడ్ చిత్రీకరణ సమయంలో అండ్రు ఫ్లింటాఫ్ కారు ప్రమాదంకు గురైంది. సర్రే లోని డన్స్ ఫోల్డ్ పార్క్ ఏరో డ్రోమ్ లో సోమవారం అండ్రు ఫ్లింటాఫ్ కారు ప్రమాదం కు గురైంది. షో టెస్ట్ ట్రాకులలో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కారు ప్రమాదానికి గురైన వెంటనే ఫ్లింటాఫ్ ను అక్కడి సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. గాయాలు అయినా, అండ్రు ఫ్లింటాఫ్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కాగా, అండ్రు ఫ్లింటాఫ్ ఇంగ్లాండ్ తరపున 79 టెస్టులు, 141 పరిమిత ఓవర్ల మ్యాచులు ఆడాడు. 2009లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. అతను 2005 యాషెస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

READ ALSO : సౌందర్య చనిపోవడానికి ముందే ఆమెకు 3 ప్రమాదాలు జరిగాయి..కానీ కొంచెంలోనే ?

Visitors Are Also Reading