Home » ఈ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?

ఈ ఫోటోలో చిరంజీవి ఎత్తుకున్న యంగ్ హీరో ఎవరో తెలుసా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సొంత టాలెంట్ తో అంచెలంచెలుగా మెగాస్టార్ గా ఎదిగారు. ఇక ఒక్క మాటలో చెప్పాలంటే చిరంజీవి ఇండస్ట్రీలో అందరికీ రోల్ మోడల్ అనే చెప్పవచ్చు. ఇంట్లో హీరోలు ఉన్నప్పటికీ కూడా చిరంజీవినే తమ రోల్ మోడల్ గా చెబుతుంటారు కొందరూ హీరోలు. చిరంజీవి మాదిరిగా డ్యాన్స్ చేయాలని.. ఆయనలా మాస్ ప్రేక్షకులకు చేరువవ్వాలని.. ఫైట్స్ చేయాలని ఇప్పటితరం హీరోలు కలలు కంటున్నారు. అలాంటి మెగాస్టార్ చేతుల మీదుగా దండ వేయించుకుని షీల్డ్ కూడా అందుకున్నాడు ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడతడు. 

Advertisement

ఇంతకు అతను ఎవరో గుర్తు పట్టగలిగారా..? ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇతను పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారసుడు కూడా. అతను ఎవరో కాదండోయ్.. సాయికుమార్ కుమారుడు ఆది. తాజాగా ఆది తన చిన్ననాటి జ్ఞాపకాన్ని ఆది ఫేస్ బుక్ లో అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా అందులో చిరంజీవితో తనకు ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. వాస్తవానికి ఆది నటించిన మొదటి సినిమా ప్రేమకావాలి సమయంలోనే చిరంజీవి ప్రమోషన్ చేసాడు. ఈ ఫోటో అప్పట్లో చంద్రమోహన్, జయసుధ జంటగా నటించిన సీనియర్ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన కలికాలం సినిమా సమయంలోనిది ఈ ఫోటో. 

Advertisement

Also Read :  మేనరికం పెళ్లి చేసుకుంటున్నారా.. ఈ విషయం తెలిస్తే ఆ వైపు చూడరు..!!

Manam News

ప్రస్తుతం ఆది షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కలికాలం సినిమాలో సాయికుమార్ ఓ కీలక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం 100 రోజుల ఫంక్షన్ కి చిరంజీవి చీఫ్ గెస్ట్ విచ్చేసి సాయికుమార్ కి షీల్డ్ అందించారు. చిరంజీవి సాయికుమార్ కుమారుడు ఆదికి షీల్డ్ ఇస్తూ అప్పట్లో దిగిన ఫోటో ఇది. ఆది సినిమాల విషయానికొస్తే.. ఆది ప్రస్తుతం రెండు సినిమాలను చేస్తున్నాడు. ఇంతకాలం తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన ఆది ప్రస్తుతం కన్నడలోకి వెళ్లాలని చూస్తున్నాడు.

Also Read :  మర్యాద రామన్నలోని ఈ సీన్ ఇప్పటికీ క్వశ్చన్ మార్క్..మీరు గమనించారా..?

Visitors Are Also Reading