సాధారణంగా సినిమాలలో కామెడీ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కామెడీకి సరికొత్త నిర్వచనం చెప్పిన తక్కువ మంది కమెడియన్ లలో ఎం.ఎస్.నారాయణ ఒకరు. బ్రహ్మానందంతో సమానమైన కమెడీయన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత దశాబ్దంలో ఈ ఇద్దరి కమెడీయన్స్ హవా మామూలు రేంజ్ లో ఉండేది కాదు. కేవలం వీరు ఉన్నారని తెలుసుకొని థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లో ఉంటుంది. తన కెరీర్ పీక్స్ స్టేజీలో ఉన్న సమయంలోనే ఎం.ఎస్. నారాయణ మరణించడం యావత్ సినీ లోకాన్ని శోక సంద్రంలోకి నెట్టేసింది. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది.
Advertisement
ఆయన రేంజ్ కామెడీ టైమింగ్ ని పండించే కమెడీయన్స్ నేటితరంలో ఎవ్వరూ లేరు. మరో పక్క బ్రహ్మనందం సినిమాలు చేయడం బాగా తగ్గించేశాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో కామెడీ కరువు అయిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఎం.ఎస్.నారాయణ నటుడు కాకముందు గొప్ప రచయిత. ఎన్నో అద్భుతమైన నవలలు రాశాడు. ఆయన రాసిన నవలలు డైలీ సీరియల్స్ మాదిరిగా వార్త పత్రికల్లో స్పెషల్ ఎడిషన్ లాగా వచ్చేది. వాటికి ఎంతో ఆదరణ లభించేది. కొన్ని సినిమాలకు రచయితగా కూడా పని చేశాడు ఎం.ఎస్.నారాయణ. తనకు ఓ దర్శకుడితో జరిగిన చేదు అనుభవం ని ఆయన బతికి ఉన్న రోజుల్లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. “ కెరీర్ ప్రారంభంలో ఓ దర్శకుడు నా దగ్గర కథలు దొబ్బేసి, నా పేరు కూడా వేయకుండా తన పేరు వేసుకున్నాడు. నాకు కోపం వచ్చి ఫుల్ గా తాగేసి అతనితో ఓ రేంజ్ లో పొట్లాడాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు ఆ దర్శకుడు ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. ఆ దర్శకుడి పేరు నాగేశ్వరరావు అనుకుంటా అని చెప్పాడు ఎం.ఎస్.నారాయణ.
Advertisement
ఆ దర్శకుడి పూర్తి పేరు శివ నాగేశ్వరరావు. ఈయన గతంలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ చిన్న బిడ్డగా ఉన్న సమయంలో తెరకెక్కిన సిసింద్రీ అనే సినిమాకి దర్శకత్వం వహించింది నాగేశ్వరరావు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన మనీ సినిమాకి ఆయనే దర్శకత్వం వహించారు. చాలా కాలం తరువాత ఆయన ఈ ఏడాది దోచేవారెవరురా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం శివనాగేశ్వరరావు తెరకెక్కించిన సినిమాల్లో ఏ సినిమాకి ఎం.ఎస్. నారాయణ కథని నొక్కేసి ఉంటాడని అభిమానులు ఆరా తీస్తున్నారు. కమెడీయన్ గా కనిపించే ఎం.ఎస్.నారాయణలో ఇంత మాస్ ఉందా అని ఆయన చెప్పే వరకు ఎవరికీ తెలియదు. మందు అలవాటు చాలా మందికి హాని కలిగిస్తుంది. కానీ ఎం.ఎస్.నారాయణ విషయంలో మందు చాలా సహాయం చేసిందట. చాలా సందర్భాల్లో ఆయనకు గొడవ పడే ధైర్యాన్ని ఇచ్చింది మందేనట. మామూలుగా ఉన్న సమయంలో తనలో తానే బాధపడేవాడట. కానీ మందు వేసినప్పుడు మాత్రం విశ్వరూపం చూపించేవాడట ఎం.ఎస్.నారాయణ. కొన్ని సినిమాల్లో ఎం.ఎస్.నారాయణ నిజంగానే మందు తాగి నటించే వాడని టాక్ కూడా వినిపిస్తోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :