Home » ఫ్లాప్ సినిమాకు రీటేక్ లు అవసరమా…? ఆ సినిమా ఫ్లాప్ అని ముందే ఊహించిన బాలయ్య..!

ఫ్లాప్ సినిమాకు రీటేక్ లు అవసరమా…? ఆ సినిమా ఫ్లాప్ అని ముందే ఊహించిన బాలయ్య..!

by AJAY
Ad

కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలో ఉండగానే ఈ సినిమాను తెరకెక్కిస్తే ఫ్లాప్ అవుతాయి అని అర్థం అవుతాయి. మరికొన్ని కథలు స్క్రిప్ట్ దశలో అద్భుతంగా ఉన్నప్పటికీ తెరకెక్కించే విధానంలో ఉన్న లోపాల ద్వారా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఈ మూవీ విడుదల అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ప్రభావం చూపదు అని అర్థం అవుతూ ఉంటుంది. అలా అర్థం అయినప్పటికీ సినిమాకు సంబంధించిన నటీనటులు… నిర్మాతలు… దర్శకులు ఆ సినిమాను ప్రచారం చేస్తూ ఉంటారు.

Advertisement

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ ఒక సినిమా స్క్రిప్ట్ దశలోనే బాగాలేదు అని తెలిసినప్పటికీ ఓకే చేయవలసి వచ్చింది అంట. అలాగే సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణ ఈ సినిమా ఎలాగో ఫ్లాప్ అవుతుంది దీనికి మరిన్ని టెక్ లు ఎందుకు అని నిర్మొహమాటంగానే షూటింగ్ సెట్లోనే చెప్పేసాడట. అలా బాలకృష్ణ ఫస్ట్ నుండే ఏ మాత్రం ఇష్టం లేకుండా నటించిన సినిమా ఏదో తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం స్టార్ డైరెక్టర్ గా కెరియర్ను కొనసాగించిన వారిలో కోదండరామిరెడ్డి ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలకు దర్శకత్వం వహించాడు. అలా ఈ దర్శకుడు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్… బాలకృష్ణతో ఒక మూవీ చేయమని చెప్పాడట.

Advertisement

అలాగే అందుకోసం సీనియర్ ఎన్టీఆర్ ఓకే చేసిన కథతో ఈ దర్శకుడు అనసూయమ్మ గారి అల్లుడు అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. దీనితో మరోసారి బాలకృష్ణతో ఒక మూవీ చేయాలి అని ఎన్టీఆర్ సూచించారట. అలాగే అని కోదండరామిరెడ్డి కూడా అన్నాడట. దానితో ఒక కథను కూడా ఓకే చేయించి వినిపించాడట. కానీ ఆ కథ ఈ దర్శకుడికి పెద్దగా నచ్చలేదట. అయినప్పటికీ సీనియర్ ఎన్టీఆర్ లాంటివారు ఓకే చేసిన కథను రిజెక్ట్ చేస్తే బాగుండదు అని సినిమాను స్టార్ట్ చేశారట.

నిజానికి బాలకృష్ణకు కూడా ఈ మూవీ కథ నచ్చలేదట. అలా పెద్దగా ఇష్టం లేకుండానే ఆ మూవీని వీరిద్దరూ మొదలు పెట్టారట. అందులో భాగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ మూవీ దర్శకుడు ఒక సన్నివేశంలో మరో టేక్ చేద్దాం అనగా ఫ్లాప్ అయ్యే సినిమాకు మరో టేక్ ఎందుకు అని బాలకృష్ణ అన్నాడట. బాలకృష్ణ అన్నట్టుగానే ఈ సినిమా విడుదల అయ్యి భారీ ఫ్లాప్ ను ఎదుర్కొంది. ఆ సినిమా ఏది అనుకుంటున్నారా..? అదే “తిరగబడ్డ తెలుగు బిడ్డ” మూవీ..!

Visitors Are Also Reading