Home » దసరా సినిమా కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

దసరా సినిమా కథ కూడా వినకుండానే రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

నేచురల్ స్టార్ హీరో నాని నటించిన ‘దసరా’ ఈ చిత్రం మార్చి 22న ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది. ఇక ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. దర్శకుడిగా  మొదటి సినిమా అయినప్పటికీ శ్రీకాంత్ ఓదెల ఎంతో క్లియర్ గా జనాలకు తన కథ అర్థమయ్యేలా అద్భుతంగా తీసాడు. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. అయితే డైరెక్టర్ తొలుత ఈ కథ రాసుకున్నప్పుడు రామ్ చరణ్ ని హీరోగా తీసుకోవాలని అనుకున్నాడనే న్యూస్ వైరల్ అవుతోంది. 

Also Read :  అక్కినేని మేనకోడలుతో కారులో అడ్డంగా దొరికిపోయిన అడవి శేష్!

Advertisement

dasra-review

ఈ కథకి బడా హీరో అయితే మరింత క్రేజ్ వస్తుందని, సినిమాకి న్యాయం జరుగుతుందని అనుకున్నారట.కానీ అంత పెద్ద హీరో తనకి ఛాన్స్ ఇవ్వడని తన ఆశలను వదులుకున్నాడట. ఆ తర్వాత ఈ కథను యంగ్ హీరో నితిన్ కి చెప్పారట. అయితే నితిన్ కి ఈ స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కథ వినకుండానే రిజెక్ట్ చేశాడట. కొత్త డైరెక్టర్ కావడంతో కెరీర్ రిస్కులో పెట్టడం ఎందుకని నితిన్ ఆలోచించి ఈ సినిమాకి నో చెప్పాడని న్యూస్ వైరల్ అవుతుంది. ఆ తర్వాత కూడా ఇద్దరు ముగ్గురు హీరోలను కూడా ట్రై చేశాడట. 

Advertisement

Also Read :  బ్లాక్ ద్రాక్ష… గ్రీన్ ద్రాక్ష… ఏది మేలు? వీటిని తింటే ఏమవుతుంది!

Manam News

ఫైనల్ గా నానికి ఈ కథ కరెక్ట్ గా సూట్ అవుతుందని భావించి ఆయన దగ్గరికెళ్లి కథ చెబుతుండగానే వెంటనే నాని ఈ సినిమా నాకు ఓకే అని అగ్రిమెంట్ పై సైన్ చేశాడట. ఈ నేపథ్యంలోనే కొందరు కోరి వచ్చిన అదృష్టాన్ని మిస్ చేసుకున్నాడు నితిన్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే వరుస ప్లాప్స్ తో ఉన్న నితిన్ ఈ చక్కని అవకాశాన్ని వదులుకున్నాడని ఫ్యాన్స్ నిరాశ వ్యక్త పరుస్తున్నారు. నితిన్ సమయం బాలేదని మరోసారి రుజువైంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి  ఏది ఏమైనా దసరా సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో నాని. 

Also Read :   కార్తికేయ… రాజమౌళి సొంత కొడుకు కాదా…? బయటపడ్డ సంచలన నిజాలు

Visitors Are Also Reading