Home » బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ఎవరో తెలుసా ?

బిగ్ బాస్ లో ఫస్ట్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ఎవరో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

బుల్లితెర బిగ్ బాస్ 7 సీజన్ తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే 6 సీజన్లను పూర్తి చేసుకున్న అతిపెద్ద రియాల్టీ షో ఏడో సీజన్ ప్రారంభం అయింది. ఈసారి కూడా వ్యాఖ్యాతగా కింగ్ నాగార్జుననే వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లకు చాలా భిన్నంగా ఈ సీజన్ ఉండబోతుందని ముందు నుంచే మేకర్స్ చెబుతూ వస్తున్నారు. అందుకు తగినట్టుగానే ఈ సీజన్ కి కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కంటెస్టెంట్ల ఎంపికలో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది. 

priyanka-jain

Advertisement

 

ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 7  చాలా ఉల్టా పల్టా గా ఉంటుందని నాగార్జున తెలియజేశారు. బిగ్ బాస్ 7  షోలోకి మొదటి కంటెస్టెంట్ గా సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ అడుగు పెట్టారు. ఆమె తర్వాత వరుసగా శివాజీ, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా  ఇలాఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రియాంక జైన్ కి  నాగార్జున ఓ టాస్క్ ఇచ్చారు. ప్రియాంక జైన్ బిగ్ బాస్ హౌస్ లో నిలుస్తుందా.. ? లేదంటే బయటకు వెళ్తుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. 

Advertisement

ప్రియాంక జైన్  మౌనరాగం అనే సీరియల్ లో అమ్ములు క్యారెక్టర్ ద్వారా అందరినీ ఆకట్టుకుంది.  ఆ తర్వాత జానకి కలగనలేదు అనే సీరియల్ ద్వారా మరింత తెచ్చుకుంది బ్యూటీ.  తాజాగా ఈ సీరియల్ ఎండ్ కార్డు  పడింది. ఈ తరుణంలోనే ప్రియాంక జెన్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. మరి బ్యూటీ బిగ్ బాస్ లో కొనసాగుతుందా..  లేదంటే మధ్యలోనే బయటకు వచ్చేస్తుందా అనేది ఆమె పర్ఫామెన్స్ ను బట్టి ముందు ముందు తెలుస్తుంది. మరి చూద్దాం ఆమె బిగ్ బాస్ హౌస్ ఏ విధంగా కలిసి వస్తుందో  తెలియాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వగానే కార్తీక దీపం బ్యూటీకి షాక్ తగిలిందా ?

షారూఖ్ ఖాన్ జవాన్ కి అల్లు అర్జున్ కి ఉన్న లింక్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading