Home » బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వగానే కార్తీక దీపం బ్యూటీకి షాక్ తగిలిందా ?

బిగ్ బాస్ కి ఎంట్రీ ఇవ్వగానే కార్తీక దీపం బ్యూటీకి షాక్ తగిలిందా ?

by Anji
Ad

సాధారణంగా ఇప్పటివరకు బిగ్ బాస్ 6  సీజన్  వరకు అందరూ చూశారు. ఇవాళ్టి నుంచి సీజన్ 7 ప్రారంభమైంది. అభిమానులకు పండుగ వాతావరణం నెలకొంది. ఇక ఈ సీజన్ లో మీరు చూడబోయే ఆట వేరు అంటూ రంగంలోకి దిగారు బిగ్ బాస్. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ తాజాగా ప్రారంభమైంది. గతంతో పోల్చితే ఈ సారి బిగ్ బాస్ షో మరింత ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. ఉల్టా పుల్టా.. ఈ సీజన్ మామూలుగా ఉండదు.. మీ అంచనాలకు అందనట్టుగా ఉంటుందంటూ ఇప్పటికే ప్రోమోలతో స్పష్టం చేశారు హోస్ట్ నాగార్జున. అందుకు తగినట్టుగానే  ఏర్పాట్లు కూడా చేసి మొత్తానికి రంగంలోకి దిగారు.

Advertisement

ఈ సారి బిగ్ బాస్ హౌస్, హోస్ట్ నాగార్జున లుక్ మరింత డిఫరెంట్ గా ఉండనుంది.  ఈ సీజన్ లో తొలి కంటిస్టెంట్ గా టీవీ సీరియల్ (జానకి కలగనలేదు) యాక్ట్రెస్ ప్రియాంక జైన్ తొలి కంటిస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుసగా శివాజీ, సింగర్ దామిని, ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, ఆట సందీప్, షకీలా ఎంట్రీ ఇచ్చారు.ఎనిమిదో కంటిస్టెంట్ గా కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. కార్తీక దీపం సీరియల్ లో మోనిత రోల్ చేసి ఫేమస్ అయింది శోభా శెట్టి. ఇది నెగెటివ్ రోల్ అయినప్పటికీ నిజ జీవితంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంటానని ఆమె  చెప్పింది.

Advertisement

అంతేకాదు.. ఏకంగా బిగ్ బాస్‌కి ఐ లవ్ యూ అని చెప్పి.. వచ్చి రాగానే ఓ బిస్కెట్ వేసింది. ఆ తర్వాత నాగార్జున కూడా ఆమెకు ట్విస్టుల మీద ట్విస్టులిచ్చారు. బయట నువ్వు ఏ పనీ చేయవట కదా.. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండగలవు అని నాగ్ ప్రశ్నించారు. అది నిజమే.. కానీ హౌస్ లో అన్ని పనులు చేసుకుంటాను  అని చెప్పింది శోభా శెట్టి. తనను అందరూ బ్యూటిఫుల్ లేడీ అంటుంటారని ఆమె చెప్పింది. దీంతో శోభాకు బిగ్ షాకిచ్చారు నాగ్. బిగ్ బాస్ హౌస్ లో నిన్ను ఎవ్వరైనా బ్యూటిఫుల్ అని కానీ, హాట్ అని కానీ అన్నారంటే పనిష్‌మెంట్ నీకే ఉంటుందంటూ ట్విస్ట్ ఇచ్చారు. అలా బిగ్ బాస్ హౌస్ లోకి కార్తీకదీపం బ్యూటీ ఎంట్రీ ఆసక్తికరంగా సాగింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

హీరో శివాజీని తల్లి అన్ని కష్టాలు పడి సాకిందా ?

 షారూఖ్ ఖాన్ జవాన్ కి అల్లు అర్జున్ కి ఉన్న లింక్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading