Home » “కాంతారా”లో పంజర్లి దేవత ఎవరు..ఆ ఆచారం ఎలా వచ్చిందంటే..?

“కాంతారా”లో పంజర్లి దేవత ఎవరు..ఆ ఆచారం ఎలా వచ్చిందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తాజాగా విడుదలైన కాంతారా మూవీ ఎలాంటి అంచనా లేకుండా థియేటర్లోకి వచ్చింది. అలాంటి ఈ సినిమా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఒక ప్రాంతంలోని దేవతల నేపథ్యంలో తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే.. ఇందులో ముఖ్యంగా పంజర్లి,గులిగా అనే దేవతలను చూపించారు.. పంచర్లి అనేది భూతకోలలో భాగంగా పూజించబడే మగ అడవి పంది యొక్క దైవిక ఆత్మ.. తులునాడులోని ప్రాచీన దేవతల్లో పంజర్లి, గులిగా ప్రధానమైన దైవాలుగా భావిస్తారు. ముఖ్యంగా ఇందులో పంజర్లిని ఎక్కువగా పూజిస్తారు.ఈ దేవత ఎక్కడి నుంచి వచ్చింది,అనేది చూద్దాం..

Advertisement

also read:నా ఇంట్లో నాకే వ్యాల్యూ లేదంటున్న చిరంజీవి..!

చాలామంది కాంతారా మూవీలో పంజర్లి అనేది ఒకటే ఉంది అని అనుకుంటున్నారు. కానీ భూత కోలాలోని ఇంకో భాగం హీరో క్లైమాక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు.. దాని పేరే గుళిగా.. బ్లాక్ కలర్ లోకి మరీ మట్టిలో ఫైట్ చేసేదే గుళిగా. కానీ కాంతారా సినిమా మొత్తం “పంజార్లి” మీదనే బేస్ చేసుకుని ఉంది కాబట్టి పూర్తి కథ తెలుసుకుందాం.. హిందూ మతం కంటే పంజర్లి పురాతనమైందని నమ్ముతూ ఉంటారు. అయితే పంజర్లి వరాహం ఎవరు అనేదానిమీద కూడా నాలుగైదు స్టోరీలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైనవి చూద్దాం..

Advertisement

ఒక ఆడవరాహానికి ఐదుగురు సంతానమైతే ఒక సంతానాన్ని శివుడు కైలాసానికి తీసుకెళ్లారని ఉంటుంది. మరో స్టోరీలో పార్వతీదేవికి నచ్చి ఒక వరాహాన్ని కైలాసానికి తీసుకెళ్లింది అని నమ్ముతారు. ఇక మరో స్టోరీ విషయానికి వస్తే ఒక రైతు ఒక వరాహాన్ని చంపేస్తే, దాని ఆత్మ కైలాసానికి వెళ్లిందని నమ్ముతూ ఉంటారు. అయితే వరాహం కైలాసానికి వెళ్లి అక్కడ తోటలన్నీ పాడు చేస్తుంటే శివుడు కోపానికి వచ్చి దాన్ని చంపేస్తాడని, దీంతో పార్వతి బాధపడి శివునికి చెప్పడంతో మళ్లీ శివుడు ఆ వరాహాన్ని బ్రతికించి భూమ్మీదికి పంపించి మంచికి చెడుకి తేడా తెలిసేలాగా ఉండమని చెబుతాడు. అదే పంజర్లి దేవతగా పూజించబడుతోంది.

also read:

Visitors Are Also Reading