Home » Allu Arjun: అల్లు అర్జున్ వేస్ట్ ఫెల్లో అంటూ తిట్టింది ఎవరో తెలుసా..?

Allu Arjun: అల్లు అర్జున్ వేస్ట్ ఫెల్లో అంటూ తిట్టింది ఎవరో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు వారి ఫ్యామిలీలో మంచి గుర్తింపు పొందిన హీరోగా అల్లు అర్జున్ పేరుపొందారు. పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సాధించారు. అలాంటి అల్లు అర్జున్ గంగోత్రి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇంతటి స్టార్ గా మారిపోయారు. అలాంటి అల్లు అర్జున్ ని ఒకాయన మాత్రం వీడు పెద్దయ్యాక ఎందుకు పనికి రాకుండా పోతాడు..వేస్ట్ ఫెలో అవుతాడు అంటూ తీవ్రంగా అవమానించారట.. మరి అలా అవమానించిన వ్యక్తి ఎవరు అనే విషయాలు పూర్తిగా చూద్దాం..

also read:డార్లింగ్ లో ప్ర‌భాస్ తండ్రి, కుష్బూ ఒకప్పుడు భార్యాభ‌ర్త‌లు అన్న సంగ‌తి తెలిసిందే…కానీ ఎందుకు విడిపోయారంటే..?

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రియే కాదు ఇండియా మొత్తంలో అల్లు అర్జున్ అంటే తెలియని వారు ఉండరు. అల్లు అర్జున్ చిన్నతనంలో ఎక్కువగా తాతయ్య నానమ్మల దగ్గర పెరిగారట. ఆయన తాతయ్య రామలింగయ్య తరచూ వీడు ఎందుకు పనికిరాకుండా పోతాడు, వేస్ట్ ఫెలో అవుతాడంటూ తిట్టేవాడట. అంతేకాకుండా పెద్దయ్యాక వాడికి ఏదైనా సపోర్టుగా ఉండాలని చెప్పేసి చిన్నతనం నుండి అల్లు అర్జున్ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టారట అల్లు రామలింగయ్య. ఎందుకంటే పెద్దయ్యాక అల్లు అర్జున్ కి ఆ డబ్బు వస్తే దానితో బిజినెస్ అయినా పెట్టుకుంటారనే ఉద్దేశంతో ఈ పని చేశారట. అయితే ఈ విషయాన్ని అల్లు అర్జున్ అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకల్లో స్వయంగా చెప్పుకొచ్చారు.

Advertisement

also read:బాలయ్య బాబు ఖర్చులు చూసి ఆశ్చర్యపోయిన అన్నగారు.. ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు..!

అయితే రామలింగయ్య చనిపోయిన తర్వాత పది లక్షల ఇన్సూరెన్స్ అల్లు అర్జున్ కు రాగానే ఆయన షాక్ అయ్యారట. ఎందుకంటే రామలింగయ్య గారికి 8 మంది మనవాళ్లు మనవరాళ్లు ఉన్నారట. కేవలం అల్లు అర్జున్ కు మాత్రమే పది లక్షలు రావడంతో మా తాత గారికి నా మీద ఇంత ప్రేమ అని మురిసిపోయాడట. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని తాత గారికి నా మీద నమ్మకం లేక ఇలా చేశారని బాధపడ్డారట. కానీ అల్లు అర్జున్ ప్రస్తుతమున్న స్థాయిని చూడడానికి అల్లు రామలింగయ్య బ్రతికుంటే మాత్రం చాలా ఆనందపడే వారని బాధపడ్డాడట.

also read:ఐపీఎల్ క్రికెట్ చరిత్రలో 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ప్లేయర్లు వీరే..!

Visitors Are Also Reading