Home » హీరోలందరూ రాజమౌళి కోసం వెయిట్.. కానీ ఆయన ఆ స్టార్ కోసం ఎదురుచూస్తున్నాడా ?

హీరోలందరూ రాజమౌళి కోసం వెయిట్.. కానీ ఆయన ఆ స్టార్ కోసం ఎదురుచూస్తున్నాడా ?

by Anji
Ad

దర్శక ధీరుడు  రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం రాజమౌళి ఏ సినిమా తీయడం లేదు. RRR మూవీతో ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి క్రేజ్ ఉంది. రాజమౌళిని మూవీ లవర్స్ కూడా గుర్తు పడతారు. ఆయన సినిమాలు ప్రపంచ స్థాయిలో ఆకట్టుకుంటడంతో.. ఇటీవలే తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీతో ఆయన సత్తా ఏంటో చూపించారు. ఆయన దర్శకత్వంలో సినిమా కోసం హీరోలు అందరూ ఎదురుచూస్తుంటారు. ఆయన మాత్రం ఓ హీరో కోసం ఎదురుచూస్తున్నారట. ఆ హీరో ఎవరు..? ఏంటి అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

శాంతి నివాసం సీరియల్ ద్వారా దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన రాజమౌళి.. ఇప్పుడు ఆయన ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆ తరువాత రాఘవేంద్రరావు శిష్యుడిగా ఎన్నో సినిమాలు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారు. ఎన్టీఆర్ హీరోగా స్టూడెంట్ నెంబర్ 1 మూవీతో దర్శకుడిగా మారి సంచలన రికార్డు సృష్టించారు. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి.. కెరీర్ లో ఒక్క ప్లాప్ లేకుండా సినిమాలు తెరకెక్కిస్తూ వెళ్తున్నాడు. గత ఏడాది RRR మూవీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ కూడా లభించింది. జాతీయ స్థాయి అవార్డులు లభించాయి.  

Advertisement

రాజమౌళి అవకాశం ఇస్తే నటించడానికి ఎంతో మంది ముందుకు వస్తారు. ఆయన  దర్శకత్వంలో నటిస్తే చాలా ఫేమస్ అయిపోవచ్చని భావిస్తుంటారు. కానీ రాజమౌళి మాత్రం ఓ హీరోతో సినిమా చాలా ఆశపడుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోతో అవకాశం వస్తే.. అసలు మిస్ చేసుకోనని రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.   ఆ హీరో మరెవ్వరో కాదండోయ్.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా.. ఆయనకు చరణ్, తారక్ అంటే చాలా ఇష్టమని చెప్పిన రాజమౌళి.. సూర్య యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు.  చాలా నేచురల్ గా సూర్య యాక్టింగ్ ఉంటుందని వెల్లడించారు. అతనితో ఛాన్స్ వస్తే తప్పకుండా సినిమాను తెరకెక్కిస్తానని.. ఆయనతో తెరకెక్కించే స్క్రిప్ట్ ప్రస్తుతం తన వద్ద లేదని వెల్లడించారు. ఒకవేళ సూర్యకి తగిన కథ సెట్ అయితే మాత్రం తప్పకుండా సినిమా తీస్తానని తెలిపారు రాజమౌళి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా పాన్ వరల్డ్ రేంజ్ లో ఓ మూవీ తీయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పవన్ కళ్యాణ్ పై రోజా సంచలన వ్యాఖ్యలు..భార్య ఉండగా వేరే అమ్మాయితో ! !

 తెలుగులో సమంత కి ఇష్టమైన హీరో.. ఎవరంటే…?

Visitors Are Also Reading