ఈ సృష్టిలో మానవునికి ఎంత ప్రత్యేకత ఉన్నదో పువ్వులకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. పువ్వులు అనేవి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. కొన్నింటికి ఆహారంగా, మరికొందరికీ తలలో పెట్టుకోవడానికి.. ఇంకొందరూ పూజలు, పురస్కారాలు చేయడానికి ఇలా పువ్వులను పలు విధాలుగా వాడుతుంటారు. పవిత్రమైన దేవాలయాల వద్ద పూజ చేయడానికి ఉపయోగించిన పువ్వులను ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
అలంకరించిన పువ్వులు అన్ని కూడా మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ముఖ్యంగా దేనికైనా ఒక కాలం ఉంటుంది. ఆ కాల పరిమితిలో అవి అయిపోతుంటాయి. ఆ రోజు పూజతో అవన్ని సరి అవుతుంటాయి. ముఖ్యంగా పూలను ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు. పూజ చేసిన పువ్వులను ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి. పువ్వులు అనేవి ప్రకృతి పరమైన ప్రాడక్ట్స్.
Advertisement
పువ్వులు ప్రకృతిని శుద్ధి చేస్తాయి. పూలను ఓ గుంత తీసి అందులో పెడితే ఎవ్వరూ తొక్కకుండా ఉంటాయి. ఎవ్వరూ తొక్కని మారుమూల ప్రదేశంలో కూడా వేయవచ్చు. వాటిని తీసుకువెళ్లి బావుల్లో చెరువుల్లో, నదుల్లో ఎక్కడో వేస్తుంటాం. పువ్వుల వల్ల నీరు అనేది కలుషితం కాదు. ఎందుకంటే అవి నేచురల్ ప్రొడక్ట్. నీటిని శుద్ధి చేస్తాయి. పువ్వులను నీటిలో ఉండే జంతువులు ఆహారంగా తీసుకుంటాయి కూడా. ప్లాస్టిక్ పదార్థాలు మాత్రం కలుషితమవుతాయి. నీటిని అత్యంత పవిత్రంగా చూడాలి. నీరు లేనిది ఈ సృష్టిలో ఏమి లేదు. ముఖ్యంగా నదులను ప్రజలు కలుషితం చేస్తున్నారు. ఇలా చేయకుండా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి :
- దటీజ్ సూపర్ స్టార్..! చిరంజీవికి అలా లైఫ్ ని ఇచ్చిన కృష్ణ ఆ సినిమా చేస్తున్నాడని తెలిసి..!
- దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?
- ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ చిరంజీవికి ముందే తెలుసు.. కానీ ఏమి జరిగిందంటే..?