ప్రస్తుతం సోషల్ మీడియా కి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అందులో పాపులర్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నారు. మరీ ముఖ్యంగా యువత సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎటువంటి సాహసాలు చేయడానికి అయినా వెనుకాడడం లేదు. ఒకవైపు డబ్బు సంపాదిస్తూ మరోవైపు సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తున్నారు. అయితే మరికొందరు వీడియోల పేరిట పిచ్చి పిచ్చి పనులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇలాంటి వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ ఉంటాయి.
Advertisement
తాజాగా ఓ కుర్రాడు చేసిన నిర్వాకానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రోడ్డు మీదకి వచ్చిన అతడిని చూసి జనాలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో ఓ యువకుడు గేదె పైకి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాడు. అది కూడా తలకు హెల్మెట్ పెట్టుకుని వచ్చేసాడు. వాహనాల మధ్యలో గేదెపై వచ్చిన అతడిని అందరు విచిత్రంగా చూశారు. గుర్రపు స్వారీ చేస్తున్నట్లుగా ఫీల్ అవుతూ అతడు స్వారీ చేయడాన్ని చూసి వాహనదారులతోపాటు పక్కన వాళ్ళంతా నవ్వుకున్నారు.
కొందరు అతడిని ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. మరికొందరు యువకులు అతడిని అనుసరిస్తూ కొద్ది దూరం వరకు వచ్చేశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ లు చేస్తున్నారు. హెల్మెట్ ఓకే సీట్ బెల్ట్ విషయం ఏంటి అని ఒకరు, ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి మీకు అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో 5 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. లక్షల్లో, వేలల్లో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.