Home » Tollywood Telugu Directors list: ఈ 15 మంది టాలీవుడ్ దర్శకులు.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసే వారో తెలుసా ?

Tollywood Telugu Directors list: ఈ 15 మంది టాలీవుడ్ దర్శకులు.. సినిమాల్లోకి రాకముందు ఏం చేసే వారో తెలుసా ?

by Anji
Ad

Tollywood telugu directors list: సాధారణంగా ఓ దర్శకుడు కావాలంటే ఇండస్ట్రీలో ఎవరో ఒక ఫేమస్ డైరెక్టర్ కింద అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలి. అలా అని వెళ్లగానే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ వస్తుందా అంటే చాలా కష్టమే. మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రైటర్, అసిస్టెంట్ దర్శకుని నుంచి డైరెక్టర్ గా సెటిల్ అయినా చాలా మంది ఉన్నారు.

వీరంతా డైరెక్ట్ గా రైటర్స్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిపోలేదు. అంతకు ముందు కొందరూ  క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటే.. మరికొందరూ జాబ్స్ చేసి ఆ జాబ్ లను వదలుకొని తమకు ఇష్టమైనటువంటి డైరెక్టర్ వైపు అడుగులు వేశారు. వారిలో చాలా మంది ఈ రోజు ఓ మంచి పొజిషన్ లో సెటిల్ అయ్యారు. టాలీవుడ్ దర్శకులు అంతకు ముందు ఎవరెవరు ఏమేమి వర్క్ చేశారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Also Read :  Writer Padmabhushan : ఓటీటీలోకి ‘రైటర్ పద్మభూషణ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Tollywood telugu directors list

Tollywood telugu directors list

Tollywood Telugu Cinema Directors List

  1. రాజమౌళి :

మనందరికీ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా మాత్రమే తెలుసు. కానీ ఆయన మంచి నటుడు కూడా. కేవలం కెమెరా వెనుకే ఆయన ప్రతిభ శీలి మాత్రమే కాదు.. ఆయన కెమెరా ముందు కూడా నటించారు. దర్శకుడిగా కాకముందు ఆయన చిన్నతనంలో  ఓ సినిమాలో నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి కొన్ని సినిమాల్లో కూడా నటించారు. అయితే దర్శకుడిగా కాక ముందు రాజమౌళి కే.రాఘవేంద్రరావు మార్గ దర్శకత్వంలో ఈటీవీలో తెలుగు సోప్ ఒపెరాలకు దర్శకత్వం వహించడం మొదలుపెట్టాడు. ఆ తరువాత కె.రాఘవేంద్రరావు నిర్మించిన శాంతి నివాసం సీరియల్ కి దర్శకత్వం వహించాడు రాజమౌళి. 2001లో జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెం.1 సినిమా తీసి దర్శకుడిగా మారారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ హిట్ సాధించడమే రాజమౌళి ప్రత్యేకత. 

Also Read :   వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?

2) శేఖర్ కమ్ముల : 

Manam News

శేఖర్ కమ్ముల టాలీవుడ్ దర్శకుల్లో ఒకరు. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లీడర్, ఫిదా వంటి సినిమాలకు దర్శకుడు శేఖర్ కమ్ముల నంది అవార్డులను అందుకున్నాడు. ఇతను సినిమాల్లోకి రాకముందు ఏం చేశాడంటే.. సీబీఐటీ(చైతన్య భారతి ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తరువాత అమెరికాలోని న్యూజెర్సీలో కంప్యూటర్ సైన్స్ లో పీజీ చేసేందుకు వెళ్లాడు. కొంత కాలం సమాచార సాంకేతిక రంగంలో పని చేశాడు. ఆ తరువాత వాషింగ్టన్ లోని హోవార్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేరాడు శేఖర్ కమ్ముల. 2000లో వచ్చిన డాలర్ డ్రీమ్స్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

3) తేజ : 

Manam News

తేజ చిన్నప్పుడు తండ్రి జె.బి.కే. చౌదరి కొరియా, జపాన్ వంటి దేశాలకు బెరైటీస్, మైకా, తిరుమల నుంచి వెంట్రుకలు ఎగుమతి చేసేవాడు. అకస్మాత్తుగా తల్లి మరణించడం వ్యాపారంలో తండ్రి నష్టపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. తేజ బాబాయి ఇంట్లో ఉంటూ.. బతుకుదెరువు కోసం సినిమా ఆఫీసుల్లో చిన్న చితకా పనులు చేస్తుండేవాడు. ఆ తరువాత చెన్నై నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. కొద్ది రోజులు పోస్టర్ ఇన్ చార్జీగా కూడా పని చేశాడు.

ఆ తరువాత కెమెరా సహాయకుడిగా పని చేశాడు. దర్శకుడు టి. కృష్ణ తేజని బాగా చూసుకునేవాడు. ఛాయ గ్రాహకులు రవికాంత్ నగాయిచ్, ఎస్. గోపాల రెడ్డి, మహిధర్ దగ్గర కొద్ది రోజులు సహాయకుడిగా పని చేశాడు. రాంగోపాల్ వర్మతో పరిచయం ఏర్పడి శివ సినిమాకి మొదటి నుంచి చివరివరకు పలు విభాగాల్లో పని చేశాడు. వర్మ దర్శకత్వంలో వచ్చిన రాత్రి చిత్రంతో ఛాయా గ్రాహకుడిగా మారాడు. ఆ తరువాత కూడా అంతం, మని వంటి సినిమాలకు పని చేశాడు తేజ. చిత్రం సినిమాతో తెలుగులో దర్శకుడిగా పరిచయమయ్యాడు. దర్శకుడిగా తేజకి తొలిచిత్రం అయినప్పటికీ ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే నంది అవార్డులతో పాటు ఫిలింపేర్ ఉత్తమ దర్వకుడి పురస్కారం కూడా అందుకున్నాడు తేజ. 

4) కృష్ణవంశీ : 

Manam News

కృష్ణవంశీ లైట్ మ్యాన్ గా సినీ కెరీర్ ప్రారంభించి టాప్ దర్శకుల్లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు. ఇతని అసలు పసుపులేని వెంకట బంగార్రాజు. అందరూ ఇప్పుడు కృష్ణవంశీ అని పిలుస్తారు. రామ్ గోపాల్ వర్మ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. జె.డి. చక్రవర్తి నటించిన 1995 క్రైమ్ చిత్రం గులాబీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.అతను రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్ పేర్ అవార్డులులు సౌత్, నాలుగు నంది అవార్డులను దక్కించుకున్నాడు కృష్ణవంశీ. 

త్రివిక్రమ్ శ్రీనివాస్  : 

Manam News

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేశాడు. గోల్డ్ మెడల్ సాధించాడు. కొంతకాలం పాటు ఉపాధ్యాయుడిగా పని చేశాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు. హైదరాబాద్ కి వచ్చి పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. తొలుత నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగంలోకి ప్రవేశం చేశాడు. 

Advertisement

మారుతి :

Manam News

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో మారుతీ కూడా ఒకరు. దర్శకుడే కాదు.. రచయిత, సహ నిర్మాత కూడా. 2004లో వచ్చిన ప్రేమిస్తే చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. 2011లో సూపర్ హిట్ అయినటువంటి ఈ రోజుల్లో చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఆ తరువాత బస్టాప్ చిత్రం విమర్శకుల నుంచి కూడా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మారుతి సినీ ఇండస్ట్రీలోకి రాకముందు రేడియం స్టిక్కరింగ్, వీఎఫ్ఎక్స్, ఆనిమేషన్ వర్క్ చేసేవాడట. 

శివ  :

శివ అలియాస్ శివకుమార్ మద్రాస్ నుంచి వచ్చిన కెమెరామన్. దర్శకుడు అవుదామనే కోరికతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈయన కెమెరామన్ గా కొన్నాళ్ల పాటు పని చేశారు. 2000లో  వెంకటేష్ హీరోగా నటించిన జయం మనదేరా చిత్రంతో తెలుగులో ఫోటోగ్రాఫర్ గా పని చేశాడు. దాదాపు 15 చిత్రాలకు పైగా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. శౌర్యం సినిమాతో దర్శకుడిగా మారారు. 

సందీప్ రెడ్డి వంగ  :

Manam News

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దాదాపు అందరికీ  సుపరిచితమే. ద్వారడాలోని ఎస్.డీ.ఎం వైద్య కళాశాలలో ఫిజియోథెరపి పూర్తి చేసి కొద్ది రోజులు వైజాగ్ లో ఉద్యోగం చేశాడు. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఆస్ట్రేలియా, సిడ్నీలోని అకాడమీ ఆఫ్ ఫిలిం, థియేటర్ అండ్ టెలివిజన్ లో ఫిలిం మేకింగ్ పై శిక్షణ తీసుకున్నాడు. 2010 నుంచి సినిమా రంగంలోని పలు విభాగాల్లో పని చేసిన సందీప్, 2010లో కేడీ సినిమాకి సహాయదర్శకుడిగా.. 2015లో మళ్లీ మళ్లీ ఇది రాని రోజు చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశాడు. 

గౌతమ్ తిన్ననూరి :

Manam News

గౌతమ్ తిన్ననూరి తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ రైటర్. హిందీలో కూడా ఓ సినిమాకి దర్శకత్వం వహించాడు. 2017లో వచ్చిన మళ్లీరావా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా మారకముందు డెల్ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్ పని చేశాడు. 

సుధీర్ వర్మ  :

తెలుగు సినిమా ప్రతిభావంతులైన దరకుల్లో ఈయన ఒకరు. సుధీర్ వర్మ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీర్. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా సినిమాలను చూసేవాడు. చిత్ర దర్శకుడు కావాలనే ఆసక్తితోనే 2002లో హైదరాబాద్ కి వచ్చాడు. 2005లో సహాయ దర్శకుడిగా అవకాశం లభించింది. 2011లో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. కానీ 2013లో తన మొదటి చిత్రాన్ని విడుదల చేశాడు. దర్శకునిగా తొలి చిత్రం స్వామిరారా.. సూపర్ హిట్ సాధించింది. 

తరుణ్ భాస్కర్  :

Manam News

తరుణ్ భాస్కర్ 2016లో దర్శకత్వం వహించిన చిత్రం  పెళ్లి చూపులు.ఈ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగానే కాకుండా ఉత్తమ మాటల రచయితగా కూడా జాతీయ పురస్కారం లభించింది. దర్శకుడు కాక ముందు తరుణ్ భాస్కర్ ఫోటోగ్రాఫర్, యాడ్ ఫిల్మ్ మేకర్ గా పని చేశాడు.

సంపత్ నంది  :

Manam News

పోసాని  కృష్ణమురళీ సంభాషణ పై ఆసక్తి కలిగి ఓ సినిమా డైరీ సహాయంతో ఆయన ఫోన్ నెంబర్ సంపాదించాడు. అప్పుడప్పుడు పోసానితో ఫోన్ మాట్లాడేవాడు. ఫస్ట్ డిగ్రీ పూర్తి చేసి రమ్మన్నాడు. తన వద్ద పని చేస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంతంగా ప్రయత్నాలు ప్రారంభించడంతో ఆ స్థానంలో సంపత్ నందికి ఆహ్వానం పంపాడు పోసాని. ఆ తరువాత పోసాని వద్ద మూడేళ్ల పాటు సహాయకుడిగా పని చేశాడు. అయితే సినిమాల్లోకి రాకముందు మాత్రం బీఫార్మసీ పూర్తి చేసి ఫార్మసిస్ట్ గా చేశాడు. 

Also Read :   చత్రపతి విలన్ భార్యను ఎప్పుడైనా చూసారా..? స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు…!

 శ్రీనివాస్ అవసరాల  :

Manam News

 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యువ దర్శకులలో శ్రీనివాస్ అవసరాల ఒకరు. అంధుల ఆశయం సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత ఆయన తన అద్భుతమైన నటనతో సినిమాలలో నటించడం ప్రారంభించారు. టాలీవుడ్ లో తన మొదటి చిత్రం అష్టాచమ్మా. శ్రీనివాస్ ఇండస్ట్రీలోకి రాకముందు మెకానికల్ ఇంజినీరింగ్ లో మాస్టర్స్ పూర్తి చేశాడు. ఫైనైట్ ఎలిమెంట్ ఎనాలసిస్ విషయంలో ప్రిన్స్ టన్ ప్లాస్మా ఫిజిక్స్ లేబోరేటరిలో పని చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ నుంచి స్క్రీన్ రైటింగ్ లో డిప్లామా పొందారు. 

దేవాకట్టా  :

Manam News

దేవాకట్టా సినీ దర్శకుడు, నిర్మాత, రచయిత. ఇతను మద్రాస్ లోనే పెరిగాడు. చెన్నైలోని సత్యభామ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తరువాత ఉన్నత చదువు కోసం అమెరికాకి వెళ్లాడు. డెట్రాయిడ్ రాష్ట్రంలోని మిషిగన్ లో వెన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్ చేశాడు. చదువు పూర్తయిన తరువాత జనరల్ మోటార్స్ లో ఉద్యోగం చేశాడు. ఓ వైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు సినిమాలకు సంబంధించిన కోర్సు చేశాడు. వెన్నెల సినిమాతో రచయితగా, దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించాడు. 

 Also Read :  మౌనిక రెడ్డికి ఇది వరకే ఓ కొడుకు..’శివుని ఆజ్ఞ’ అంటూ మంచు మనోజ్ పోస్ట్‌

Visitors Are Also Reading