Home » వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?

వీరసింహారెడ్డి సినిమా చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది.. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ ఏమన్నారంటే ?

by Anji
Ad

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి.  2023 సంక్రాంతి పండుగకి విడుదలై ఈ ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను తెగ మెప్పించింది. ఓటీటీ లో కూడా అదరగొడుతున్న ఈ సినిమాపై తాజాగా సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఓ రివ్యూ ఇచ్చాడు.తాను వీరసింహారెడ్డి చిత్రం చూశానని.. ఈ సినిమా చూస్తుంటే నాకు నందమూరి తారకరామారావు గారి “చండశాసనులు” సినిమా  గుర్తుకొచ్చిందని చెప్పుకొచ్చాడు. దాదాపు రెండు సినిమాల కథాబీజం ఒకటే. అన్నాచెల్లెళ్ల మధ్య వైరం, అన్నయ్య నాశనమైపోవాలని శపించడం వంటివి రెండిటిలోనూ ఉంటాయి. 

Also Read :  పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. ఆ హీరోతోనేనా..?

Advertisement

వీరసింహారెడ్డిలో తాను కోరుకున్న వాడిని చంపేశాడనే కోపంతో అన్నయ్య శత్రువుల ఇంట్లో ఒకరితో తాళి కట్టించుకొని వాళ్ల సాయంతో సొంత అన్న మీద పగ తీర్చుకోవాలనుకుంటుంది చెల్లెలు వరలక్ష్మి. బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు ఇది బాగా సరిపోయింది. ఫస్టాఫ్ చూసినంత సేపు ఈ సినిమా బోయపాటి శ్రీను సినిమా చూసినట్లే అనిపించిందని తెలిపాడు. ఇక ఈ చిత్రం  ఫస్టాఫ్ బంగారంలా ఉందని.. కానీ సెకండాఫ్  బంగారం, వెండికి మధ్యలో ఉన్నట్లు అనిపించిందని వెల్లడించాడు పరుచూరి గోపాల కృష్ణ. ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్ గా కామ్ అయిపోయి చెల్లెలిని చూసి తోకాడిస్తే చూడబుద్ధి కాదు. అయినప్పటికీ అన్నాచెల్లెళ్ల అనుబంధమే ఈ సినిమాను కాపాడింది. దాదాపు రూ.130 కోట్లకు పైగా వసూలు చేయగలిగింది. కానీ ఇదే సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలాగంటే.. పెద్ద బాలయ్య పాత్ర చనిపోయాక ఫ్లాష్ బ్యాక్ చూపించారు. 

Advertisement

Also Read :  మోహన్ బాబు మనోజ్ పెళ్ళికి వెళ్లడానికి కారణం ఎవరో తెలుసా..?

veerasimhareddy-review

ఎప్పుడైతే ఆయన పాత్ర చనిపోయాడని  ప్రేక్షకులకు తెలిసిపోయిందో అప్పుడే ఓ నిరాశ వచ్చేస్తుంది. ఇక సెకండాఫ్ లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అంత నిడివి అవసరమే లేదు. ఇక నవీన్ చంద్ర ఆత్మHaత్య చేసుకున్నట్లు చూపించారు. కానీ అది వాస్తవం కాదని తాను పసిగట్టాను. హీరో మూలంగా అతడు చనిపోయినట్టు ఉంటే మాత్రం ఈ సినిమా అస్సలు ఆడేదే కాదు. ఈ సినిమాలో ఉన్న ప్రాథమిక లోపం ఏంటంటే..  వీరసింహారెడ్డి పాత్రను ముగించి తర్వాత ఫ్లాష్ బ్యాక్ చూపించడం ప్రధాన లోపం.  కొన ఊపిరితో ఉన్నప్పుడు చిన్న బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ చెప్పి.. ఆ తరువాత  అతడు విలన్ ను చంపేసి అత్త, తండ్రికి సమాధులు కట్టినట్లు చూపించి ఉంటే చాలా బాగుండేది. మరోవైపు శృతిహాసన్  తండ్రి కూడా విలన్లలో ఒకడని చూపించాడు. కానీ ఆ పాత్ర ఏమైందో మాత్రం చూపించలేదు. హీరో, హీరోయిన్లకు పెళ్లి అయిందా..? లేదా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు అసలు ఏమయ్యారు? ఇలా కొన్నింటిని చూపించకుండానే సినిమాని ముగించేశారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు అన్నింటిని జయించి.. వీరసింహారెడ్డి  సినిమా అన్ని కోట్లు రాబట్టడానికి కారణం బాలయ్యనే   అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ. 

Also Read :  ఠాగూర్ సినిమా లోని ఈ సీన్స్ రిపీట్ ! ప్రాణం కాపాడవలసిన డాక్టర్స్ ఎలాంటి పని చేసారంటే ?

Visitors Are Also Reading