Telugu News » Blog » కృష్ణవంశీ,రమ్యకృష్ణల కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

కృష్ణవంశీ,రమ్యకృష్ణల కొడుకు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన కృష్ణవంశీ అలనాటి స్టార్ హీరోయిన్ అయిన రమ్యకృష్ణను ప్రేమించి వివాహం చేసుకొని ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి వీరికి ఒక కొడుకు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. మరి ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాలు చూద్దాం.. డైరెక్టర్ కృష్ణ వంశీ ప్రస్తుతం రంగమార్తాండ సినిమాతో చాలా బిజీగా ఉన్నారు. ప్రకాష్ రాజ్,రమ్యకృష్ణ జంటగా నటించిన రంగమార్తాండ చిత్రం ఈనెల 22వ తేదీన థియేటర్లోకి రానుంది. ఈ తరుణంలో కృష్ణవంశీ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు..

Advertisement

Also Read:దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేసి నా జీవితంలో స్థిరపడాలని మా తల్లిదండ్రులు కోరుకున్నారు. కానీ నాకేమో సినిమాలు తప్ప వేరే ఆలోచన ఉండేది కాదు. దీంతో మా ఇంట్లో చెప్పకుండా పారిపోయాను. నేను అంతః పురం సినిమా చేస్తున్న టైంలో మా నాన్నగారు చనిపోయారు. ఇక అప్పటినుంచి మా అమ్మ కూడా నాతోనే ఉంటుంది. ఆమె నాతో తప్ప మరెక్కడ కూడా ఉండదు ఉండలేదు కూడా.. కృష్ణవంశీ తన కొడుకు గురించి మాట్లాడుతూ మా అబ్బాయి రిత్విక్ వంశీ టీనేజ్ లో ఉన్నారు.

Advertisement

Also Read:తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!

అతని అభిరుచులు వారానికి ఒకసారి మారుతూ ఉంటాయి. ఓసారి క్రికెట్ అంటాడు మరోసారి ఫుట్బాల్ అంటాడు. ఇంకోసారి ఇంకేదో అంటాడు. నా భార్య రమ్య వాడిని హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. వాడి చదువు ఇతర విషయాలు ఆమె చూసుకుంటుందని అన్నారు. ఇక రంగమార్తాండ చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ , అనసూయ భరద్వాజ్, శివాత్మిక రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యపాత్రలో చేస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా సంగీతం , ఆకెళ్ళ శివప్రసాద్ డైలాగ్స్ అందించారు. కాకర్ల శ్యామ్ లక్ష్మీ భూపాల , బల్లా విజయ్ కుమార్ బాణీలు అందిస్తున్నారు.. ఎంతో ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ మూవీ ప్రతి ఒక్క ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని కృష్ణవంశీ తెలియజేశారు.

Advertisement

Also Read:ప్రియుడి కోసం మొద‌ట భ‌ర్త‌ను త‌ర‌వాత త‌మ్ముడిని..ఈ లేడీ మామూలు ఖిలేడీ కాదు..!

You may also like