Telugu News » Blog » తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!

తారకరత్న గురించి అలేఖ్య చేసిన పోస్ట్ చూస్తే బాధపడకుండా ఉండరు..!

by Anji
Ads

నందమూరి కల్యాణ్ రామ్ ఫిబ్రవరి 18న తిరిగిరాని లోకాలకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా తన భర్త, దివంగత నటుడు తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఓ భావోద్వేగపు పోస్ట్ చేశారు అలేఖ్యరెడ్డి. ముఖ్యంగా పెళ్లి జరిగినప్పటి నుంచి తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. అయినవాళ్లు చూపించిన ద్వేషం వల్లనే తన భర్త మానసిక వేదనకు గురయ్యాడని తెలిపారు. 

Advertisement

Also Read :  ప్రియుడి కోసం మొద‌ట భ‌ర్త‌ను త‌ర‌వాత త‌మ్ముడిని..ఈ లేడీ మామూలు ఖిలేడీ కాదు..!

“నువ్వు మాకు దూరం అయి నెల రోజులు అవుతోంది. నీ జ్ఞాపకాలు ఇంకా నా మదిలో అలాగే ఉన్నాయి. మనం కలిశాం, స్నేహితులమయ్యాం.. డేటింగ్ లో ఉన్నాం. మన బంధం ముందుకు కొనసాగుతుందా ? అనే సందేహంలో ఉన్నప్పుడు జీవితంలో కొత్త ప్రయాణం పట్ల నువ్వు పూర్తి నమ్మకంతో ఉన్నావు. ఒక నిర్ణయం వల్ల నువ్వు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నావు.  వాటి మధ్యనే మన పెళ్లి జరిగింది. గందరగోళ పరిస్థితుల్లో మనం వివక్ష ఎదుర్కొన్నాం. ఎన్ని  ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనం సంతోషంగా ముందుకు సాగాం. నిష్కా పుట్టిన తరువాత మన జీవితం ఎంతో మారింది. సంతోషం పెరిగినప్పటికీ బాధ అలాగే కొనసాగింది. రోజూ ఏదో ఒక విధంగా ద్వేషాన్ని ఎదుర్కొన్నాం. అలాంటి సమయంలో 2019లో ఓ అద్భుతమే జరిగింది. 

Advertisement

Also Read :  15 రోజుల్లో బలగం చిత్రం ద్వారా దిల్ రాజు ఎంత సంపాదించాడో తెలుసా?

Manam News

మనకు కవల పిల్లలు జన్మించారు. కుటుంబాన్ని నువ్వు ఎంతో మిస్ అవుతున్న కారణంగా మనకంటూ పెద్ద కుటుంబం ఉంటే బాగుంటుందని అనుకున్నావు. చివరి వరకు నువ్వు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నావు. సొంత వారి వల్లనే నీ మనసుకు చాలా బాధ కలిగింది. దానిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. చివరికీ నేను కూడా నిన్ను ఆ బాధ నుంచి బయటికి తీసుకురాలేకపోయాను. మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్లే చివరిదాకా అండగా నిలిచారు. మనం ఎవరినీ అయితే కోల్పోయామో వాళ్లు నీ చివరి చూపునకు రాలేదు. నీతో ఉన్నది తక్కువ సమయమే అయినప్పటికీ నీ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను. శాంతి, సతోషం ఉన్న చోట మనం మళ్లీ కలుసుకుందాం” అని ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్యరెడ్డి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Advertisement

Also Read :  మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌లో సంద‌డి చేసిన మ‌నోజ్ దంప‌తులు…క‌నిపించని మంచు విష్ణు..!

You may also like