Home » ప్రేమ గురించి హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి ఏమ‌న్న‌దో తెలుసా..?

ప్రేమ గురించి హీరోయిన్‌ సాయిప‌ల్ల‌వి ఏమ‌న్న‌దో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్‌ల‌లో ఒక‌రైనా సాయిప‌ల్ల‌వి గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అందం, అభిన‌యంతో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. త‌న డ్యాన్స్‌తో ఎంతోమందిని మెప్పిస్తోంది ఈ నాచుల‌ర్ బ్యూటీ. తొలుత నుంచి న‌టిగా త‌న‌కు అంటూ కొన్ని పరిమితుల‌ను పెట్టుకున్న సాయిప‌ల్ల‌వి గ్లామ‌ర్ షో, ఎక్స్‌పోజింగ్‌కు దూరం అనే సంగ‌తి తెలిసిన‌దే. పాత్ర న‌చ్చితేనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. ఇలా ఎన్నో వైవిద్య‌మైన పాత్ర‌లు చేస్తూ వ‌స్తున్న ఆమె ఇటీవ‌ల శ్యామ్ సింగ‌రాయ్ సినిమాతో హిట్ కొట్టింది.

Advertisement

త్వ‌ర‌లో విరాట ప‌ర్వం చిత్రంతో అభిమానుల‌ను ప‌లుక‌రించ‌బోతుంది. ఈ త‌రుణంలో ఇటీవ‌ల మీడియాతో ముచ్చటించారు. సాయిప‌ల్ల‌వి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను పంచుకుంది. ఈ సంద‌ర్భంగా ఐటెం, స్పెష‌ల్ సాంగ్‌ల‌పై ఆమెకు ప్ర‌శ్న ఎదురైంది. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ‌, రంగ‌స్థ‌లంలోని జిగేలు రాణి వంటి త‌ర‌హా పాట‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే చేస్తారా..? అని హోస్ట్ అడ‌గ్గా చేయ‌న‌ని స‌మాధానం చెప్పింది. ఆమె వివ‌ర‌ణ ఇస్తూ.. ఐటెం సాంగ్స్ నాకు కంఫ‌ర్ట్‌గా ఉండ‌వు. ఒక‌వేళ భ‌విష్య‌త్‌లో అలాంటి వాటిలో న‌టించే అవ‌కాశం వ‌చ్చినా చేయ‌ను అని చెబుతాను.

Advertisement

ఎందుకు అంటే వ‌స్త్రధార‌ణ స‌రిగ్గా లేక‌పోతే నాకు ఇబ్బందిగా ఉంటుంది. వాటిలో నేను కంఫ‌ర్ట్ గా ఉండ‌లేను. అందుకే స్పెష‌ల్ సాంగ్ లో అస‌లు న‌టించ‌లేను. నాకు అస‌లు అలాంటి పాట‌లు చేయాల‌నే ఆస‌క్తి లేద‌ని చెప్పింది. ప్రేమ‌పై త‌న అభిప్రాయం ఏంట‌ని అడ‌గ్గా.. జీవితానికి కెరీర్ ఎంత ముఖ్య‌మో ప్రేమ అంతే ముఖ్య‌మ‌ని వెల్ల‌డించింది. ముఖ్యంగా రెండింటిలో ఏది లేక‌పోయినా జీవితం సంపూర్ణం కాదు అని స‌మాధానం చెప్పింది సాయిప‌ల్ల‌వి. రానాతో ఆమె క‌లిసి న‌టించిన విరాట‌ప‌ర్వం జులై 01న విడుద‌ల కానున్న‌ది.

Also Read : 

Adipurush: సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్‌

మీ సంసార జీవితం సుఖంగా సాగాలంటే… భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..?

 

Visitors Are Also Reading