Home » మీ సంసార జీవితం సుఖంగా సాగాలంటే… భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..?

మీ సంసార జీవితం సుఖంగా సాగాలంటే… భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

పెళ్లి కాకముందు ప్రతి ఒక్కరూ పెళ్లంటే నూరేళ్ల పంట అని భావిస్తారు. కానీ పెళ్లి తర్వాత భార్య భర్తల మధ్య ఒక్క ఆలోచన కూడా తేడా ఉన్నా అది నూరేళ్ళ మంట గా మారుతుంది. మరి భార్య భర్తలు సుఖంగా అన్యోన్యమైన జీవితాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలో ఓ సారి చూద్దాం..? అయితే వివాహం చేసుకున్నప్పుడు అబ్బాయి వయసు ఎక్కువ అమ్మాయి వయసు తక్కువగా ఉన్న వారిని మాత్రమే సెలెక్ట్ చేసి వివాహం చేస్తారు. ఈ సందర్భంలోనే కొంతమంది అమ్మాయిలు తమ కంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు,మరికొందరేమో సమాన వయసు ఉంటే మాత్రమే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారు. నిజానికి మన దాంపత్య జీవితం సాఫీగా సాగాలంటే భార్యాభర్తల మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో ఓ సారి చూద్దాం..?చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువతీ యువకులు వారి మధ్య ఉన్న వయసు తేడా ని ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటారు. కనీసం ఇద్దరి మధ్య రెండు నుంచి మూడేళ్ల తేడా మాత్రమే చూసుకుంటారు. కానీ మరికొందరు మాత్రం పది సంవత్సరాలు లేకపోతే చేసుకోరు. కొందరు అమ్మాయిలు వాళ్ళ కంటే చాలా పెద్ద వాళ్లను, మరికొందరేమో సమాన ఏజ్ ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. కానీ భార్యాభర్తల మధ్య కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాల గ్యాప్ ఉన్నటువంటి దంపతుల మధ్య అపార్థాలు, గొడవలు, వాదనలు చాలా తక్కువగా ఉంటాయని ఒక సర్వేలో తేలింది. ఇందులో ఎవరో ఒకరు మాత్రం మెచ్యూరిటిగా ఆలోచిస్తారని, గొడవలు రాకుండా చూసుకుంటారని వెంటనే సర్దుకుపోతారు అని వివాహబంధం తెగిపోకుండా జాగ్రత్త పడతారట. అలాగే పది సంవత్సరాలు ఏజ్ గ్యాప్ ఉన్న దంపతులు మధ్య ఎప్పుడు భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. వీళ్ళు ఏజ్ గ్యాప్ వల్ల సర్దుకుపో లేరు. అలాగే 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకుంటే వారి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చి వారి అభిరుచులు కలవక సంసార జీవితం చెడిపోతుందని అంటుంటారు. కాబట్టి వివాహం చేసుకునే వారిలో వయస్సు అనేది చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.

Advertisement

ALSO READ;

Advertisement

మెగాస్టార్ చిరంజీవి కూడా సినిమాల్లో న‌టించార‌న్న సంగ‌తి తెలుసా…ఆయ‌న నటించిన‌ సినిమాలివే…!

అల్లు అర్జున్ ను మెగా ఫ్యాన్స్ పక్కన బెడుతున్నారా…?

 

Visitors Are Also Reading