Home » Adipurush: సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్‌

Adipurush: సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆదిపురుష్‌

by Anji
Ad

రాధేశ్యామ్ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఉన్న‌ప్పుడే అప్‌డేట్ ఇవ్వండి అంటూ అభిమానులు ఎంత హంగామా చేశారో అంద‌రికీ తెలిసే ఉంటుంది. ఓ వైపు ఇత‌ర సినిమాల నుంచి ఒక‌దానికి మించి మ‌రొక‌టి అప్‌డేట్ వ‌స్తుంటే.. రాధేశ్యామ్ మేక‌ర్స్ మాత్రం మౌనం పాటించ‌డంతో ట్విట్ట‌ర్‌లో ర‌క‌ర‌కాల వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం ఆదిపురుష్ సినిమా విష‌యంలోనూ అదే సీన్ రిపీట్ అయింది. మేక‌ర్స్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాక‌పోవ‌డంతో.. # wake up Team Adipurush అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ కొన‌సాగుతుంది.

Advertisement

వాస్త‌వానికి ఆదిఫురుష్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్త‌యింది. ఇప్పుడు యూనిట్ మొత్తం గ్రాఫిక్స్‌, ఇత‌ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌నుల‌ను ముగించే ప‌నిలో నిమ‌గ్న‌మైంది షూటింగ్ ముగిసింది. కాబ‌ట్టి యూనిట్ నుంచి అప్పుడప్పుడు ఏమైనా అప్‌డేట్ వ‌స్తాయ‌ని అభిమానులు ఆశించారు. కానీ మేక‌ర్స్ వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లుతూ ఎలాంటి అప్‌డేట్ ఇవ్వ‌డం లేదు. ప్ర‌భాస్ రాముడు పాత్ర పోషిస్తున్నాడు కాబ‌ట్టి.. శ్రీ‌రామ‌న‌వ‌మి రోజు గ్రాండ్ అప్‌డేట్ వ‌స్తుంది అభిమానులు ఎంతో ఆశించారు. కానీ ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్‌ను క‌చ్చితంగా విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు. మేక‌ర్స్ ట్విస్ట్ఇస్తూ కేవ‌లం ఫ్యాన్స్ మేడ్ వీడియోతో స‌రిపెట్టింది.

Advertisement

ఆ త‌రువాత‌నైనా ఏమైనా అప్‌డేట్ వ‌స్తాయనుకుంటే అది కూడా లేదు. దీంతో విసుగెత్తిపోయిన ప్ర‌భాస్ అభిమానులు ట్విట్ట‌ర్‌లో # wake up Team Adipurush అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేయ‌డం ప్రారంభించారు. ఇది నేష‌న్ వైడ్ ట్రెండ్ అవుతోంది. ఈ ట్రెండ్‌పై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో ఇక చూడాలి మ‌రి. మొద‌ట ఈ ఏడాది ఆగ‌స్టులోనే విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. గ్రాఫిక్స్ వ‌ర్క్ చాలా ఎక్కువ‌గా ఉండ‌డంతో వ‌చ్చే ఏడాదికి వాయిదా వేశారు. ప్ర‌భాస్ రాముడిగా సీత పాత్ర‌లో కృతిస‌న‌న్ ఈ చిత్రంలో న‌టిస్తోంది.

Also Read :

సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త పరిస్థితి ఎలా ఉందో తెలుసా..!

‘అఖండ’ అరుదైన రికార్డు.. దేశంలోనే ఈ ఫీట్ అందుకున్న హీరో బాల‌య్య‌..!

 

Visitors Are Also Reading