నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రం మొదటి రోజే రూ.54 కోట్లు వసూలు చేసి బాలయ్య సినిమాలన్నింకెల్లా రికార్డు సృష్టించిందనే చెప్పాలి. వీరసింహారెడ్డి టైటిల్ ఎలా పెట్టారని ఓ అభిమాని దర్శకుడు గోపిచంద్ మలినేనిని ప్రశ్నించగా.. క్యారెక్టర్ పేరు వీరసింహారెడ్డి.. టైటిల్ అదే అయితే రీచ్ ఎక్కువగా ఉంటది అని, వీరసింహారెడ్డిలో సింహం ఉందని, బాలయ్యకి సింహ అనే సెంటిమెంట్ కలిసి వస్తుందని వీరసింహారెడ్డి పెట్టినట్టు దర్శకుడు గోపిచంద్ వివరించారు. ముఖ్యంగా వరలక్ష్మీ శరత్ కుమార్ వెరైటీగా పొడుస్తుంది బాలయ్యని. ఆ సీన్ ని టర్కీలోని ఇస్తాంబుల్ లో తీశారు.
Advertisement
షూటింగ్ సమయంలో ఆ సీన్ చూసి అక్కడి ప్రజలు పరిషాన్ అయ్యారు. టూరిస్ట్ లు ఎక్కువగా వచ్చే ప్లేస్ ఇస్తాంబుల్. షూటింగ్ అని తెలియని వారు కొంతమంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి కత్తులతో పొడిచే సీన్ చూసి ఆశ్చర్యపోయారని దర్శకుడు గోపిచంద్ వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా సమయంలో బ్లాక్ షర్ట్ అని స్వయంగా బాలయ్యగారే చెప్పారు. అఖండ సినిమాతో బాలయ్య మంచి ఫామ్ లో, క్రాక్ సినిమాతో గోపిచంద్ మలినేని నుంచి ప్రేక్షకులు చాలా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాని చేసినట్టు దర్శకుడు చెప్పుకొచ్చారు.
Advertisement
Also Read : “వాల్తేరు వీరయ్య”లో ఆ స్టార్ విలన్ కి ఇంతటీ అవమానం జరిగిందా..?
వీరసింహారెడ్డి చిత్రంలో అనుకోకుండా తన కుమారుడికి మంచి క్యారెక్టర్ సెట్ అయిందని తెలిపాడు గోపిచంద్. అదేవిధంగా కన్నడ నటుడు దునియా విజయ్ అద్భుతమైన నటుడు అని, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న వ్యక్తిగా ఇతను అయితే విలన్ గా బాగా సెట్ అవుతాడని అతన్ని సంప్రదించినట్టు వెల్లడించారు. టాలీవుడ్ నటుడు శ్రీహరితో సినిమా చేసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకొచ్చాడు గోపిచంద్. అదేవిధంగా ఎస్.ఎస్.థమన్ మంచి మ్యూజిక్ అందించాడని.. ఈ సినిమాకు అందరి సహకారం ఉండడం వల్లనే సూపర్ హిట్ సాధించగలిగామని తెలిపాడు దర్శకుడు.
Also Read : మోహన్ బాబు కోసం అన్నగారు పెద్ద ప్రమాదంలో ఉండి కూడా ఆ సినిమాలో నటించారా..?