Home » మోహన్ బాబు కోసం అన్నగారు పెద్ద ప్రమాదంలో ఉండి కూడా ఆ సినిమాలో నటించారా..?

మోహన్ బాబు కోసం అన్నగారు పెద్ద ప్రమాదంలో ఉండి కూడా ఆ సినిమాలో నటించారా..?

by Anji
Published: Last Updated on
Ad

దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన పలు సినిమాలలో నందమూరి తారక రామారావు నటించారు. ఇక వీరిద్ధరి కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాలు ఎక్కువగా హిట్ అయ్యాయి. అందులో మేజర్ చంద్రకాంత్ ఒకటి. ఈ సినిమాకు నిర్మాతగా యాక్షన్ కింగ్ మోహన్ బాబు వ్యవహరించారు. అంతేకాదు.. ఈ చిత్రంలో మోహన్ బాబు కొడుకుగా, ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. ఈ చిత్రం విడుదలై దాదాపు మూడు దశాబ్దాలు కావస్తుంది. ఏప్రిల్ 23, 1993 రోజున విడుదలైన మేజర్ చంద్రకాంత్ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ భారీ బ్లాక్ బస్టర్ చిత్రం గురించి మనం ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయం తెలుసుకుందాం. 

Advertisement

మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఎన్టీఆర్ ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారట.  ఆ సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో సమ్మె కొనసాగుతోంది. దీంతో రాత్రికి రాత్రి అక్కడ షూటింగ్ ఆపేసి బెంగళూరులో షూటింగ్ చేయాలని చిత్ర బృందం భావించింది. ఈ చిత్రంలో పని చేస్తున్న వారందరినీ కూడా కుమార కృప అనే ఓ కర్ణాటక గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంచారు. ఈ సినిమాలోని పుణ్యభూమి నా దేశం అనే పాటను కర్ణాటకలోని రాజమహల్ ప్యాలెస్ లో కొంత భాగాన్ని షూటింగ్ చేయగా.. అక్కడ ప్యాలెస్ మధ్య భాగంలో ప్రాంగణం ఉండేదట. ఆ ప్రాంగణంలోనే ఓపెన్ ఎయిర్ లో ఉన్నటువంటి ఓ దర్బార్ సెట్ లో ఎత్తైన ఒక ప్లాట్ పామ్ పై సింహాసనం అరెంజ్ చేసారు. 

Advertisement

Also Read :  ఆ హీరోయిన్ వల్ల సీనియర్ ఎన్టీఆర్ అన్ని ఇబ్బందులు పడ్డారా..?

ఇక ఆ సమయంలో తెల్ల దొరల పాలిట ఉగ్ర స్వరూపంగా వీర పాండ్య కట్ట బ్రాహ్మణ పాత్రలో ఉన్నటువంటి ఎన్టీఆర్ ఎంతో ఆవేశంగా ఎందుకు కట్టాలి రా శిస్తూ అంటూ పాట పాడుతూ సింహాసనం ముందు ఉన్న తక్తువంటి దానిని తన్నితే అది వెళ్లి బ్రిటిష్ తెల్లదొర పై పడే విధంగా ప్లాన్ చేయగా.. ఎన్టీఆర్ తన్నే తన్నుడికి ఇక ఆ స్టేజీ అంతా కూడా కదిలిపోయింది. అంతేకాదు.. ఒంటిపై అప్పటికే భారీగా కాస్ట్యూమ్స్ ఉండడంతో దాదాపు ఎన్టీఆర్ కింద పడిపోయే పరిస్థితి వచ్చిందట. కానీ సమయస్ఫూర్తితో తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ చివరి క్షణంలో ఎన్టీఆర్ పట్టు బిగించారట. అది చూస్తున్న వారందరూ ఆశ్చర్యపోయారట. ఇక వెంటనే మోహన్ బాబు పరిగెత్తుకుంటూ వెళ్లి షూటింగ్ ఆపేసి ఇంటికి వెళ్లిపోదామని చెప్పారాట. అయితే నిర్మాతగా నీకు నష్టం రాకూడదు అని ఎన్టీఆర్ చెప్పి మరీ షూటింగ్ లో పాల్గొన్నారట. అందులో ఇప్పటి చాలా మంది ఎన్టీఆర్ ని ఆదర్శంగా తీసుకుంటారు. 

Also Read : “నీ పైన ఉన్న అభిమానం ఓట్లుగా ఎందుకు మారలేదు” ? అన్న బాలయ్య ప్రశ్న కి పవన్ ఇచ్చిన సమాధానం !

Visitors Are Also Reading