సినీ నటుడు నందమూరి తారకరత్న ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగలం’ పాదయాత్రలో పాల్గొన్నటువంటి తారకరత్న ఉన్నటువంటి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Advertisement
ఈ విషయం తెలుసుకున్న టవంటి బాలకృష్ణ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అయితే వాస్తవానికి తారకరత్న ఆసుపత్రికి వచ్చినప్పుడు పల్స్ లేదని వైద్యులు వెల్లడించారు. శరీరము నీలం రంగుగా మారిందని వెంటనే చికిత్స ప్రారంభించినట్లు తెలిపారు. తారకరత్న పల్స్ సాధారణ స్థితికి చేరుకునేందుకు దాదాపు 45 నిమిషాల సమయం పట్టిందని చెప్పారు. తలుతా సిపిఆర్ చేసుంటే ఆయన పరిస్థితి విషమంగా ఉండేది కాదని కొందరు చెబుతున్నారు.
Advertisement
దాదాపు 23 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొంది మరణించారు తారకరత్న. ఆయన చికిత్స పొంది తిరిగి వస్తారని అందరూ భావించారు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయార. తారకరత్న ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేద్దాం అనుకునే లోపే ఇలా జరిగిందని అభిమానులు బాధపడుతున్నార. కొద్దిరోజుల కిందటే ఎన్టీఆర్ గురించి తారకరత్న మాట్లాడిన చివరి మాటలను అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కళ్యాణ్ రాముడు అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఆరకరత్నకు ఎన్టీఆర్ అంటే ఎంత ప్రేమ అనేది ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది.
Also Read : రమ్యకృష్ణను అలా చూసి ఏడ్చేశా…కృష్ణవంశీ ఎమోషనల్..!
కుప్పం పర్యటనలో ఉన్న సమయంలో తారకరత్న మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ నా తమ్ముడే కదా జూనియర్ ఎన్టీఆర్ ని వేరేగా చూడడం అనేది ఉండదు. ప్రేమగా చూడాలనే వాటిని నేను నమ్మను. నందమూరి బిడ్డ నందమూరి రక్తం నా తమ్ముడు. ఎన్టీఆర్ ఎప్పటికీ నా తమ్ముడు అన్నకి తమ్ముడు మీద ఎంత ఆప్యాయత ఉంటుందో అంతే ఆప్యాయత నాకు ఉంటుంది ” అని ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను తన మాటల్లో వెల్లడించారు తారకరత్న. ఎన్టీఆర్ గురించి తారకరాత్మ మాట్లాడిన చివరి మాటలు అవే కావడంతో అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Also Read : సమంత జ్ఞాపకాలను దూరం చేసుకుంటున్న చైతూ..ఈసారి ఏం చేశాడంటే..?