సాధారణంగా హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి వరుసగా ఒక మూడు సినిమాలు చేస్తే ఆ సినిమాల్లో వాళ్ల కెమిస్ట్రీ బాగుంటే ఇక అక్కడే అంతా అయిపోయింది. ఆ హీరో హీరోయిన్ల అభిమానులు వాళ్లిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రేమించుకుంటున్నారని.. పెళ్లి చేసుకుంటున్నారని ఇలా ఎవరికి తోచింది వారు అంటుంటారు. మీడియాలో వారిపై డబుల్ ఫోకస్ పెట్టి వాళ్లు బయటికొస్తే చాలు ఏవేవో రాసేస్తారు. అలాగే ఇప్పుడు రౌడి బాయ్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న మీద వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ చాలా రోజుల నుంచి అందరూ అనుమానపడుతున్నారు. దీనికి తోడు వారిద్దరూ కలిసి ప్రైవేట్ గా కలవడం ఫ్యామిలీ ట్రిప్స్ కి వెళ్లడం, డేట్ కి వెళ్లడం వీళ్ల రిలేషన్ పై మరింత అనుమానాలను పెంచాయి.
ఇక రష్మిక, విజయ్ లు మాత్రం మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని.. మా మధ్య ఇంకెలాంటి రిలేషన్ లేదని చెప్పారు. అయినప్పటికీ ఎవ్వరూ కూడా నమ్మడం లేదు. వీరు రిలేషన్‌లోనే ఉన్నారనే అభిమానులు అనుకుంటున్నారు. ఈ యవ్వారం మీద విజయ్ ని కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ అడిగాడు. లైగర్ ప్రమోషన్ కోసం షో కి విజయ్ అనన్య వచ్చి సందడి చేశారు. ఇక ఈ షోలో విజయ్ కి కిరణ్ నీకు, రష్మికకు మధ్య ఏముంది అని అడగగా.. విజయ్ ఎప్పటి మాదిరిగానే మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నీ షేర్ చేసుకుంటాం. మా మధ్య దాపరికాలు లేవంటూ చెప్పాడు. మీరు అనుకున్నట్టు మా మధ్య ప్రేమ ఏం లేదు మంచి స్నేహితులమంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్.
Advertisement
Advertisement
కరణ్ జోహార్ మాత్రం సంతృప్తి చెందలేదేమో అనన్యను విజయ్ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటని అడిగాడు. దీనికి అనన్య వెనుక ముందు ఏమి ఆలోచించకుండా విజయ్ తొందర పడుతున్నాడు రష్..మీకా.. సింగ్ ను కలిసేందుకు అంటూ చెప్పకనే చెప్పేసి రష్.. మీకా.. అంటూ హింట్ ఇచ్చింది. ఇక పరోక్షంగా వాళ్లు రిలేషన్ లో ఉన్నారని చెప్పింది. ఇక విజయ్ ఆ మాటలకు పెద్దగా ఆశ్చర్యపోలేదు. నీకు అలా అనిపిస్తుందా అంటూ నవ్వాడు. ఇక కరణ్ జోహార్ మాత్రం నొక్కి నొక్కి రష్.. మీకా.. అంటూ అనడంతో అందరికీ రష్మీక అనే విషయం క్లారిటీగా అర్థమైంది. ఇక నెటిజన్స్ కూడా హో రష్.. మీకా నా సరే అంటూ ఫన్నీగా స్పందించడం విశేషం.
Also Read :
సిల్వర్ స్క్రీన్ పై గ్యాంగ్‌స్టర్లుగా నటించి మెప్పించింది వీరే..!
రామా రాజమౌళి లవ్ స్టొరీ గురించి తెలుసా…? పెళ్ళై కొడుకు ఉన్నా ఎందుకు చేసుకున్నారంటే…?