Home » సిల్వ‌ర్ స్క్రీన్ పై గ్యాంగ్‌స్ట‌ర్లుగా న‌టించి మెప్పించింది వీరే..!

సిల్వ‌ర్ స్క్రీన్ పై గ్యాంగ్‌స్ట‌ర్లుగా న‌టించి మెప్పించింది వీరే..!

by Anji
Ad

బాలీవుడ్ గ్యాంగ్‌స్ట‌ర్స్ పై సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. పేరొందిన సెల‌బ్రిటీలు సైతం గ్యాంగ్‌స్ట‌ర్స్ గా న‌టించి మెప్పించారు. ఇక గ్యాంగ్‌స్ట‌ర్స్ పై వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. షారూఖ్ ఖాన్ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్ వ‌ర‌కు ఈ లిస్ట్ లో ఉన్నారు. షారూఖ్ ఖాన్ 2017 చిత్రం రయీస్ లో అబ్దుల్ ల‌తీఫ్ పాత్ర‌ను పోషించారు. అత‌ను గుజ‌రాత్ లో అక్ర‌మ మ‌ద్యం వ్యాపారం చేసే వాడు.


అజ‌య్ దేవ‌గ‌న్ 2010లో వ‌న్స్ అపాన్ టైమ్ ఇన్ ముంబై చిత్రంలో గ్యాంగ్‌స్ట‌ర్స్ హాజీ మ‌స్తాన్ పాత్ర‌ను పోషించాడు. అత‌న్ని సుల్తాన్ మీర్జా అని కూడా పిలుస్తారు. స్మ‌గ్లింగ్ లో ఇత‌ను మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్. 2007లో షూటౌట్ ఎట్ లోఖండ్ వాలా చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మాయ డోలాస్ పాత్ర‌ను పోషించారు. ఇత‌ను దావూద్ ఇబ్రాహీం వ‌ద్ద ప‌ని చేసిన అండ‌ర్ వ‌ర‌ల్డ్ గ్యాంగ్ స్ట‌ర్. 1991లో 25వ ఏట లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో జ‌రిగిన కాల్పుల్లో హ‌త‌మ‌య్యాడు.

Advertisement

Advertisement


వినోద్ ఖ‌న్నా 1988లోని ద‌య‌వాన్ లో శ‌క్తి వేలు పాత్ర‌ను పోషించారు. ఆయ‌న పూర్తి పేరు వ‌ర‌ద‌రాజ‌న్ ముద‌లియారి. ఆయ‌న త‌మిళ‌నాడుకు చెందిన వారు. 1987లో మ‌ణిర‌త్నం ఆయ‌న జీవిత క‌థతో నాయ‌క‌న్ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో క‌మ‌ల్ హాస‌న్ హీరో శ్ర‌ద్ధాక‌పూర్ సైతం సిల్వ‌ర్ స్క్రీన్ పై దావూద్ ఇబ్ర‌హీం సోద‌రి హ‌సీనా పార్క‌ర్ పాత్ర‌ను కూడా పోషించింది. ఈ చిత్రం 2017లో విడుద‌లై మంచి విజ‌యం సాధించింది.

జాన్ అబ్ర‌హం 2013లో విడుద‌లైన షూటౌట్ ఎట్ వ‌డాలా చిత్రంలో మాన్య స‌ర్వే పాత్ర‌ను పోషించాడు. అత‌ను చ‌దువుకున్న గ్యాంగ్‌స్ట‌ర్‌గా న‌టించాడు. అత‌డు క్రైమ్ ప్ర‌పంచంలోకి ఎలా ప్ర‌వేశించాడ‌నేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు. 37 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో మాన్య పోలీస్ ఎన్ కౌంట‌ర్ లో మ‌ర‌ణించాడు. అర్జున్ రాంపాల్ 2017లో విడుద‌లైన డాడీ చిత్రంలో గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన రాజ‌కీయ వేత్త అరుణ్ గావ్లీ పాత్ర‌ను పోషించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ్లాప్ గా నిలిచింది.

Also Read :

తెలుగులో ఆ రికార్డ్ కేవలం పవన్, మహేష్ కు మాత్రమే సొంతం…!

ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి పెళ్లి గురించి మీకు తెలుసా..? ఆమెని పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వ‌చ్చిందంటే..?

 

Visitors Are Also Reading