Home » రమా రాజమౌళి లవ్ స్టొరీ గురించి తెలుసా…? పెళ్ళై కొడుకు ఉన్నా ఎందుకు చేసుకున్నారంటే…?

రమా రాజమౌళి లవ్ స్టొరీ గురించి తెలుసా…? పెళ్ళై కొడుకు ఉన్నా ఎందుకు చేసుకున్నారంటే…?

by Anji
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ప్ర‌ఖ్యాతిని ప్ర‌పంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన ద‌ర్శ‌కుల్లో రాజ‌మౌళి ఒక‌ర‌ని చెప్పాలి. ఓట‌మి ఎరుగ‌ని ద‌ర్శ‌కుడు విశేష ప్రేక్ష‌కాద‌ర‌న పొందిన ధీరుడు. ఆయ‌న సినిమా చేశాడంటే ఆ సినిమా త‌ప్ప‌కుండా విజ‌యం సాదించాల్సిదే. ఆయ‌న సినిమా దాదాపు మూడేళ్ల స‌మ‌యం ప‌డుతుంది. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల‌తో ఆయ‌న ఖ్యాతి అమాంతం పెరిగింది. ఇక టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా కూడా ఒక రేంజ్‌లో ఉటుంద‌ని టాక్ వినిపిస్తోంది.

 

 

Advertisement

ముఖ్యంగా రాజ‌మౌళి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు వ‌ద్ద శిష్య‌రికం చేసి స్టూడెంట్ నెంబ‌ర్ 1 చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం చేసే అవ‌కాశం ద‌క్కించుకుని తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ త‌రువాత సింహాద్రి, సై, ఛ‌త్ర‌ప‌తి, విక్ర‌మార్కుడు, య‌మ‌దొంగ‌, మ‌గ‌ధీర‌, మ‌ర్యాద రామ‌న్న‌, ఈగ‌, బాహుబ‌లి, బాహుబ‌లి 2, ఆర్ఆర్ఆర్ చిత్రాల‌ను తెర‌కెక్కించి సూప‌ర్ హిట్ ద‌ర్శ‌కునిగా పేరు సంపాదించుకున్నారు.

Advertisement

మీ స‌క్సెస్ కి సీక్రెట్ ఏమిటి అని రాజ‌మౌలిని ప్ర‌శ్నిస్తే సింపుల్ గా మా ఫ్యామిలీ అని స‌మాధానం చెబుతుంటాడు. ఇక జ‌క్క‌న్న ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో రెండ‌వ పెళ్లి చేసుకోవ‌డ ప‌లుమార్లు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

rajamouli

rajamouli

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో క్యాస్ట్యూమ్ డిజైన‌ర్ గా త‌న‌ని తాను నిరూపించుకున్నారు ర‌మారాజ‌మౌళి. ఆమె ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళికి రెండో భార్య అనే విష‌యం చాలా త‌క్కువ మందికే తెలుసు. ఈమె గ‌తంలో ఓ వ్య‌క్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు కార్తికేయ అనే కొడుకు ఉన్నాడు. ఆ త‌రువాత ర‌మ త‌న మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకున్నారు. 2000లో ర‌మ‌, రాజ‌మౌళి స్నేహం క్ర‌మ క్ర‌మంగా ప్రేమ‌గా మారింది. అలా వారి మ‌న‌సులో ఒక‌రిపై మ‌రొక‌ర‌కి ఇష్టం పెరిగి 2001లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఆపై వీరిద్ద‌రూ మ‌యూఖ అనే అమ్మాయిని ద‌త్త‌త తీసుకున్నారు. అలా రాజ‌మౌళి ప్ర‌తి విజ‌యంలో కూడా ఆయ‌న స‌తీమ‌ణి ర‌మా రాజ‌మౌళి ఉన్నారు. ప్ర‌స్తుతం వీరిద్ద‌రూ ఎంతో అన్యోన్యంగా క‌లిసి మెలిసి ఉంటున్నారు.

Also Read : 

కాజ‌ల్ అగ‌ర్వాల్ రిజెక్ట్ చేసిన సినిమాల గురించి మీకు తెలుసా..?

బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టిన థాంక్యూ సినిమా…!

 

Visitors Are Also Reading