సాధారణంగా ఫిబ్రవరి 15 తేదీ దాటిందంటే దాదాపు ఎండాకాలం సీజను వచ్చినట్టే లెక్క. ఇక ఇప్పటినుంచి పగటిపూట ఎండలు దంచి కొడుతుంటాయి. రోజురోజుకు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. అయితే వేసవి పాపాన్ని తట్టుకోవడానికి ఎండలో నుంచి వచ్చిన వరు వెంటనే ఉపశమనం పొందడం కోసం చల్లని నీరు లేదా కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనం కోసమే ఉపయోగపడతాయి. కానీ ఆరోగ్యానికి చల్లని పదార్థాలు అంతగా మంచిది కాదని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
Advertisement
అంతేకాదు శరీరానికి అధిక క్యాలరీల శక్తి అందిస్తుంది. వాటికి బదులుగా ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు కూరగాయలను రోజువారి ఆహారంలో తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. వేసవికాలంలో శరీరంలోని నీరు ఎక్కువగా చమట రూపంలో బయటికి పోతుంది కాబట్టి నీటిని అధికంగా తాగుతుండాలి. శరీరంలో నీటి శాతం తగ్గితే డిహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అధికమవుతాయి. అంతే కాదు ఎండాకాలంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
Advertisement
ఇక పండ్ల విషయానికి వస్తే… స్ట్రాబెర్రీ, సిట్రస్ జాతికి చెందిన పనులను తీసుకోవడం చాలా మంచిది. చర్మానికి రక్త సరఫరా చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. అంతేకాదు శరీరంలోని వేడిని కూడా తగ్గిస్తాయి. బయట ఎండ నుంచి వచ్చినప్పుడు ప్రయాణాలు చేసి అలసటగా అనిపించినప్పుడు కూల్ డ్రింక్స్ కి బదులు కొబ్బరినీళ్లు నిమ్మరసం లేదా మజ్జిగ చల్లని కొండలేరు తాగడం మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో అందరికీ అందుబాటులో ఉండి మామిడి పండ్లను పైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, వివిధ పోషకాలు చాలా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి ఇవి చాలా మేలు చేస్తాయి. వేడి వాతావరణం తట్టుకునే విధంగా నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను కూరగాయలను తినడం చాలా ఉత్తమం. వీటి వల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది ఎండాకాలంలో లభించే అటువంటి ద్రాక్ష పన్ను కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Also Read : ఉపాసన కంటే ఆ హీరోయిన్ ఇష్టమంటూ రామ్ చరణ్ సంచలన కామెంట్స్..!!