Home » రోజుకు ఎనిమిది గంట‌లు నిద్ర‌పోక‌పోతే ఏమి జ‌రుగుతుందో తెలుసా..?

రోజుకు ఎనిమిది గంట‌లు నిద్ర‌పోక‌పోతే ఏమి జ‌రుగుతుందో తెలుసా..?

by Anji
Ad

రోజు మొత్తం కోల్పోయిన శ‌క్తిని తిరిగి తీసుకురావ‌డ‌మే నిద్ర ఉద్దేశం. చాలా మంది వైద్య నిపుణుల ప్ర‌కారం.. రోజుకు ఆరోగ్యక‌ర‌మైన ఒక వ్యక్తి ప్ర‌తిరోజు 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు నిద్ర‌పోవ‌డం చాలా అవస‌రం. నేటి కాలంలో చాలా మంది ప‌ని ఒత్తిడి కార‌ణంగా చాలా త‌క్కువ గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోతుంటారు. వారు కొత్త వ్యాధుల‌ను కొని తెచ్చుకుంటున్నారు. నిద్ర స‌రిగ్గా లేకుంటే అస‌లు ఏమి జ‌రుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

నేటి హ‌డావిడి జీవితం, బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా చాలా మంది కేవ‌లం 4 నుంచి 5 గంట‌లు మాత్ర‌మే నిద్ర‌పోతున్నారు. ఆ త‌రువాత ఆఫీస్ లో అలిసిపోయిన‌ట్టు కనిపిస్తారు. వ‌రుస‌గా చాలా రోజులు త‌క్కువ‌గా నిద్ర‌పోవ‌డం మీ ఆరోగ్యంపై చెడు ప్ర‌భావం చూపుతుంది. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే అది ప్రాణాంత‌కంగా మారొచ్చు. త‌గినంత నిద్ర పోవ‌డానికి య‌త్నించ‌డం చాలా అవ‌స‌రం. నిద్ర మ‌నిషికి ఎంతో ముఖ్యం. నిద్ర లేక‌పోతే నీర‌సంగా ఉండి ఏ ప‌ని చేయాల‌న్నా అంత‌గా ఆస‌క్తి చూప‌లేరు.

Advertisement


కొన్ని చెడు అల‌వాట్ల ప‌ట్ల కూడా కొంత‌మంది స‌రిగ్గా నిద్ర‌పోరు. ఆల్క‌హాల్, గంజాయి తీసుకోవ‌డం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ముఖ్యంగా ఇది శ‌రీరంలోని అనేక భాగాల‌కు తీవ్ర‌మైన హాని క‌లిగిస్తుంది. కొంత‌మంది ఈ అల‌వాటును వ‌దిలివేయ‌రు. మ‌త్తు వ‌ల్ల నిద్ర బాగా వ‌స్తుందని కొంద‌రు అనుకుంటారు. కొన్ని రోజుల‌కు దీనివ‌ల్ల మీకు నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌దు. అందుకే మంచి నిద్ర కోసం మ‌ద్యం, గంజాయి వంటివి అస్స‌లు వినియోగించ‌కూడ‌దు. సాధార‌ణంగా కంటి నిద్ర‌పోతే ఎంతో ఆరోగ్య‌వంతంగా ఉన్న‌ట్టు లెక్క‌. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా కంటి నిండ నిద్ర‌పోయి ఆరోగ్యంగా ఉండండి.

Also Read : 

లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ కోసం ఎటువంటి పనులు చేసేవారో తెలుసా ?

అదిరే అభికి షూటింగ్‌లో ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

 

Visitors Are Also Reading