Home » లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ కోసం ఎటువంటి పనులు చేసేవారో తెలుసా ?

లక్ష్మి పార్వతి మొదటి భర్త టీడీపీ కోసం ఎటువంటి పనులు చేసేవారో తెలుసా ?

by AJAY
Ad

ఎన్టీరామారావు త‌న భార్య భ‌స‌వ‌తార‌కం మ‌ర‌ణానంత‌రం ల‌క్ష్మీపార్వ‌తిని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఇబ్బందుల్లో ఉన్న స‌మ‌యంలో ల‌క్ష్మీపార్వ‌తి త‌న‌ను చూసుకుంద‌ని అందువ‌ల్లే తోడు కోసం వివాహం చేసుకున్నాన‌ని ఎన్టీఆర్ అప్ప‌ట్లో స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే అప్ప‌టికే ల‌క్ష్మీపార్వ‌తికి వివాహం కాగా ఒక కుమారుడు కూడా ఉన్నాడు.

Advertisement

ల‌క్ష్మీ పార్వ‌తి మొద‌టి భ‌ర్త పేరు వీర‌గ్రంధం వెంక‌ట సుబ్బారావు. ఆయ‌న హ‌రిక‌ళ‌లో ప్ర‌సిద్దుడు. హిందూ మ‌తం క‌లుషితం అవ్వ‌కుండా ఖండాలు దాటి హ‌రిక‌ళ ద్వారా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌చ్చాడు. అయితే వీర‌గ్రంధంకు కూడా ల‌క్ష్మీ పార్వ‌తి రెండ‌వ భార్య‌నే..ఆయ‌న మొదటి భార్య బిడ్డ పుట్టిన వెంట‌నే మ‌ర‌ణించ‌డంతో పెద్ద‌లు ల‌క్ష్మీపార్వ‌తితో వివాహం జ‌రిపించారు.

Advertisement

ల‌క్ష్మీపార్వతి సంస్కృతంలో డిగ్రీ చేసింది. పెళ్లైన త‌ర‌వాత ల‌క్ష్మీ పార్వ‌తి ఎంఏ చ‌దువుతానంటే ఆమె భ‌ర్త నాగార్జున యూనివ‌ర్సిటీలో చేర్పించారు. అంతే కాకుండా ఒక క‌ళాకారుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సీఎం అయితే క‌ళ బ్ర‌తుకుతుంద‌ని భావించిన సుబ్బారావు టీడీపీలో చేరి ఆ పార్టీ త‌ర‌పున ప్ర‌చారం కూడా చేయ‌డం మొద‌లుపెట్టారు. ఇక సుబ్బారావు ఓ సంధ‌ర్బంగా త‌న భార్య ల‌క్ష్మీ పార్వ‌తితో క‌లిసి అమెరికాకు వెళ్లి హ‌రిక‌థ చెప్పారు.

ఈ విష‌యం ఎన్టీఆర్ కు తెలిసి వారిద్ద‌రినీ పిలిపించుకుని అభినందించారు. అంతే కాకుండా వీర‌గ్రంధం వెంక‌ట సుబ్బారావు క‌ళాకారుల కోసం వీర‌గ్రంధం క‌ళాక్షేత్రం అనే సంస్థ‌ను స్థాపించాడు. దానికోసం ఎన్టీఆర్ కొంత భూమిని ఇవ్వ‌గా ఆ భూమిని లక్ష్మీపార్వ‌తి పేరిట రిజిస్ట్రేష‌న్ చేయించారు. కానీ ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం ఆ భూమి విష‌య‌మై కొంత‌కాలం ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి.

Visitors Are Also Reading