Home » అదిరే అభికి షూటింగ్‌లో ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

అదిరే అభికి షూటింగ్‌లో ప్ర‌మాదం.. అస‌లు ఏమి జ‌రిగిందంటే..?

by Anji
Ad

ప్ర‌భాస్ సినిమా ఈశ్వ‌ర్ తో తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయ్యాడు అభిన‌య కృష్ణ‌. జ‌బ‌ర్ద‌స్త్‌లో అడుగుపెట్టిన త‌రువాత‌ అదిరె అభిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల‌పై ఇష్టంతో సాప్ట్ వేర్ జాబ్ వ‌దిలేసి ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం ప్ర‌య‌త్నించాడు. జ‌బ‌ర్ద‌స్త్‌లో చాలా ఏళ్లుగా స్కిట్స్ చేస్తూ అల‌రిస్తూ ఉన్నాడు. ఇక సినిమాల్లో అడ‌పాద‌డ‌పా న‌టిస్తూనే ప్రేక్ష‌కుల‌కు అందుబాటులో ఉంటున్నాడు అభి.


ఇక ఈ మ‌ధ్య కాలంలో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి చాలా మంది ఫేమ‌స్ క‌మెడియ‌న్స్ బ‌య‌టికి వెళ్లారు. అందులో అదిరె అభి కూడా ఉన్నారు. మంచి అవ‌కాశాల కోసం జ‌బ‌ర్ద‌స్త్‌ను వ‌దిలి వెళ్తున్నారు. సినిమాల్లో అవ‌కాశాలు రావ‌డంతోనే చాలా మంది జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడుతున్నారు. అదిరే అభి కూడా సినిమాల్లో న‌టించే ఛాన్స్ రావ‌డంతో జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్ర‌స్తుతం ఒక సినిమాలో లీడ్ రోల్ చేస్తున్నాడు అభి. ఇక ఆ సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చేసేట‌ప్పుడు అభికి ప్ర‌మాదం జ‌రిగింది. అభి చేతికి, కాలికి గాయాలు త‌గిలిన‌ట్టు స‌మాచారం.

Advertisement

Advertisement


ముఖ్యంగా అభి చేతికి తీవ్ర గాయాల‌య్యాయ‌ట‌. వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా.. చేతికి 15 కుట్లు ప‌డ్డాయ‌ని సినిమా బృందంలోకి ఓ వ్య‌క్తి స‌మాచారం ఇచ్చారు. అదిరే అభి ఆరోగ్యం మాత్రం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. ఇక అదిరే అభి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు కోరుతున్నారు. జ‌బ‌ర్ద‌స్త్‌లో అభి ఏ స్కిట్ చేసినా అందులో ప‌క్కా కామెడీ ఉంటుంది. చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Also Read : 

వానాకాలంలో ఈ ఫ్రూట్స్ తింటే.. చర్మ వ్యాధులు దరిచేరవు..?

జ‌యం సినిమాకు గోపిచంద్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading