దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా గురించి చర్చించుకుంటున్నారంటే అందుకు కారణం జక్కన్న అనే చెప్పాలి. ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించే సినిమాలు రికార్డులను చూసి సినీ ఇండస్ట్రీలని ఖంగుతిన్నాయి. జక్కన చెక్కిన ప్రతీ సినిమా కూడా ఓ రికార్డును క్రియేట్ చేస్తుంటుంది. అటు మాస్.. ఇటు క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని సినిమాలను తెరకెక్కిస్తుంటారు రాజమౌళి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు శిష్యునిగా స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు.
Advertisement
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలోనే అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాల్లో ఒక్క సినిమా కూడా పరాజయం కాకపోవడం ఇతని ప్రత్యేకత.ప్రధానంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వరల్డ్ దర్శకుడిగా ఇమేజ్ ని సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమాతో అంతర్జాతీయంగా ఉన్నటువంటి పలువురు దర్శకులు, పలువురు సినీ ప్రముఖులు జక్కన్నపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత రాజమౌళి పారితోషికం భారీ స్థాయిలోనే పెరిగిపోయింది. సినిమాల ద్వారా రాజమౌళి సంపాదించిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైమాటనే అని చెప్పాలి. రాజమౌళి కేవలం పారితోషకం మాత్రమే తీసుకోవడం కాకుండా లాభాల్లో కూడా వాటాలను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Also Read : నరేష్ నిద్ర లేచిదంటే చాలు అదే పని.. ఆసక్తికర కామెంట్స్ చేసిన రమ్య రఘుపతి..!
ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ సినిమాకు రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఇక జక్కన్న తన పారితోషికంలో ఎక్కువ భాగం దేని కోసం ఖర్చు చేస్తారనే విషయానికొస్తే.. ఆయన పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసం ఖర్చు చేస్తారట. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి రాజమౌళి తెగ ఆసక్తి చూపిస్తారని సమాచారం. చాలా వరకు సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసం ఆయన పారితోషికాన్ని వెచ్చించి మరీ కొనుగోలు చేస్తారట. సినిమాల మీద రాజమౌళికి ఉన్న డెడికేషన్ కి నిజంగా హ్యాట్సాప్ అంటున్నారు సినీ అభిమానులు.