టాలీవుడ్ అగ్రదర్శకుడు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బాహుబలి సినిమాని పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కించి సూపర్ హిట్ సాధించిన తరువాత ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. సినిమా విడుదలకు 10 రోజుల ముందు నుంచే దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా ప్రస్తుతం టాలీవుడ్ నటులు బిజీగా ఉన్నారు. హీరో హీరోయిన్ ఒక చోట ప్రచారం కొనసాగిస్తే.. దర్శకులు, నిర్మాతలు మరో చోట సినిమా ప్రమోషన్‌లలో పాల్గొంటున్నారు. ఇందులో టాలీవుడ్ దర్శకుడు పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం లైగర్.
ఇవి కూడా చదవండి : Sr ఎన్టీఆర్ తో బ్రేక్ అప్ అయ్యిందా ? ఆమెను అన్నగారు వివాహం చేసుకోవాలని అనుకున్నారా ?
Advertisement
లైగర్ సినిమాలో హీరో తల్లి పాత్ర పోషించిన నటి రమ్యకృష్ణ ఇటీవల ముంబయిలో ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి మీడియాను ఆమె హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్‌లతో నటించిన సినిమాలపై ప్రశ్నించగా.. 1996 నాటి చాహత్ చిత్రం గురించి ఆమె ప్రస్తావించారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాలో ఆమె ప్రతి నాయిక పాత్రను పోషించారు. అయితే షారుఖ్ చూసి చాలా ఏళ్లయింది. అతడు తన శక్తిని ఎక్కడి నుంచి తీసుకుంటాడో తెలియదు. అప్పట్లో షారుఖ్.. ఇప్పుడు రణవీర్‌సింగ్ అని అనుకుంటున్నాను.
Advertisement
ఇవి కూడా చదవండి : కార్తికేయ 2 కాంట్రవర్సీలో జరిగింది ఇదే..!
ముఖ్యంగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి సిరీస్ లో శివగామి పాత్రతో రమ్య ఇంటిపేరుగా మారింది. బాహుబలి సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని అసలు ఊహించలేదన్నారు. ఒక సౌత్ ఇండియా సినిమా కారణంగానే పాన్ ఇండియా అనే పదానికి ప్రాధాన్యత వచ్చిందని చెప్పడానికి గర్వపడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రజినికాంత్ 169వ చిత్రమైన జైలర్ లో ప్రత్యేక పాత్రను పోషిస్తున్నట్టు వెల్లడించారు రమ్యకృష్ణ. బీటౌన్‌లో బాయ్‌కాట్ అనేపదం సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతుండగా.. లైగర్ టీమ్ స్వేచ్ఛగా ప్రమోషన్లలో పాల్గొనడం పట్ల హిందీ సిని అభిమానులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన లైగర్ చిత్రానికి కరణ్ జోహార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 25న ఈ చిత్రం దేశవ్యాప్తంగా విడుదలవ్వనుంది.
ఇవి కూడా చదవండి : ఆ హీరో పెళ్లి చేసుకోవాలని చెప్పాడు..? నిత్యామీనన్ కామెంట్స్ వైరల్…!