Home » ఆ హీరో పెళ్లి చేసుకోవాలని చెప్పాడు..? నిత్యామీనన్ కామెంట్స్ వైరల్…!

ఆ హీరో పెళ్లి చేసుకోవాలని చెప్పాడు..? నిత్యామీనన్ కామెంట్స్ వైరల్…!

by AJAY
Ad

అలా మొదలైంది సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నిత్యా మీనన్. టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి నిత్యా మీనన్ అభిమానులను సంపాదించుకుంది. చూడ్డానికి క్యూట్ గా కనిపిస్తూ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండి నటన కు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించింది.

Advertisement

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఇదిలా ఉండగా ఏజ్ బార్ అవుతున్నా నిత్యా పెళ్లికి మాత్రం దూరంగానే ఉంది. దాంతో ఎప్పుడు నిత్యా పెళ్లి వార్తలు టాలీవుడ్ లో వైరల్ అవుతునే ఉంటాయి. గత కొద్ది రోజులుగా కూడా నిత్యా పెళ్లి అంటూ టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

Advertisement

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో నిత్యా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. తన కాలు కు గాయం అవ్వడం తో సినిమా కథలు వినకుండా రెస్ట్ తీసుకున్నా అని చెప్పింది. దాంతో నిత్య మీనన్ కథలు వినడం లేదని పెళ్లి చేసుకుంటుంది అని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.

దుల్కర్ సల్మాన్ మిమ్మల్ని పెళ్లి చేసుకోమని సూచించారట అని ప్రశ్నించగా….అవును నాకు మంచి స్నేహితుడు పెళ్లి చేసుకుని హ్యాపీ గా ఫ్యామిలీ తో ఉండు అని చెబుతూ ఉంటాడని తెలిపింది. ప్రస్తుతానికి తనకు పెళ్లి ఆలోచన లేదని ఫ్యూచర్ లో చేసుకుంటానో లేదో చెప్పలేను అని తెలిపింది. తనను ఇండస్ట్రీ లో బ్యాన్ చేశారు అనే ప్రచారం కూడా జరిగింది అని ఇండస్ట్రీ లో మనం పైకి ఎదుగుతూ ఉంటే కిందకి లాగవాల్లు కూడా ఉంటారని పేర్కొంది.

Also read : ఒక్కసారిగా విబేధాలు రావడంతో ఎన్టీఆర్ ఏఎన్నార్ లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా..?

Visitors Are Also Reading