Home » కార్తికేయ 2 కాంట్రవర్సీలో జరిగింది ఇదే..!

కార్తికేయ 2 కాంట్రవర్సీలో జరిగింది ఇదే..!

by Azhar
Ad

నిఖిల్ హీరోగా తాజాగా కార్తికేయ 2 అనే సినిమా విడుదలైంది. ఇక ఈ నెల 13న వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుండే హిట్ టాక్ అనేది తెచ్చుకుంది. ఇక హిందీలో కూడా విడుదలైన ఈ సినిమా అనేది రోజు రోజుకు తన థియేటర్స్ పెంచుకుంటూనే వెళ్తుంది. కానీ ఈ సినిమా విడుదల విషయంలో పెద్ద కథే నడించింది అనేది అందరికి తెలుసు. దీని విడుదలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఆపాలి అని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

హీరో నిఖిల్ కూడా అలంటి కామెంట్స్ చేసాడు. కానీ ఇప్పుడు సినిమా హిట్ అయిన తర్వాత అవి మానేసాడు. అయితే అసలు ఈ సినిమా విడుదలకు ముందు ఏం జరిగి ఉంటుంది అనే విషయం సీనియర్ దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి ఉహించి వివరించాడు. అయితే నేను చాలా సినిమాలు చేశాను. ఎప్పుడైనా మన సినిమాకు పోటీగా వచ్చే సినిమాను ఆగమని అడగడం… వారు మిరే ఆగడు అని చెప్పం మాములే.

Advertisement

ఇక ఈ కార్తికేయ 2 సినిమ విషయంలో దిల్ రాజు కూడా ఇదే చేసాడు. నాగ చైతన్య నిఖిల్ కంటే పెద్ద హీరో కావడంతో ఈ సినిమాను ఆగమని చెప్పి ఉంటాడు. ఎందుకంటే ఇది వస్తే తన సినిమా ప్లాప్ అవుతుంది అని దిల్ రాజు అనుకోని ఉంటాడు. అయిన దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత ఓ పెద్ద హీరో సినిమా కోసం చిన్న హీరో సినిమాను ఆగమని చెప్పాడంటేనే వారు ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి :

భారత జట్టుకు దొరికిన లక్కీ ప్లేయర్‌.. ఉంటె విజయమే..!

1000 రోజులు పూర్తి చేసుకున్న విరాట్..!

Visitors Are Also Reading