సాధారణంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక బన్నీ భార్య స్నేహారెడ్డి కూడా ఈ మధ్య ఫుల్ పాలోయింగ్ ని సంపాదించుకుంది. ప్రధానంగా భర్తకి సంబంధించిన అప్ డేట్స్, పిల్లల వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ మధ్య స్నేహారెడ్డి తన అందంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతుందనే చెప్పాలి. స్టార్ హీరోయిన్ లకు ధీటుగా స్నేహారెడ్డి ఫోటో షూట్ చేస్తుంది.
Advertisement
బన్నీ సైతం స్నేహారెడ్డి మీద నాటీ కామెంట్లు చేస్తుంటాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో స్నేహారెడ్డి ఎక్కువగా ప్రీతమ్ జుకల్కర్,సాధన సింగ్ లు మేకప్ స్టైలీస్ ల డిజైన్లలోనే కనిపిస్తోంది. స్నేహారెడ్డి తన ఫాలోవర్స్ ని ఇంటరాక్ట్ అవుతోంది. తాజాగా స్నేహా తన ఫాలోవర్స్ తో చిట్ చేసింది. చిట్ చాట్ లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పింది.
Advertisement
Also Read : న్యూయర్ లోపు అందరి పేర్లు బయటపెడతా.. కాస్టింగ్ కౌచ్ పై కల్పిక గణేషన్ సెన్సేషనల్ కామెంట్స్..!
ఓ నెటిజన్ ఏ ఫుడ్ అంటే ఇష్టం అని అడగగా.. ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం అని సమాధానం ఇచ్చింది స్నేహారెడ్డి. మరో నెటిజన్ మీరు మార్నింగ్ పర్సనా..? నైట్ పర్సనా ? అని ప్రశ్నించగా..? నాక్ మార్నింగ్ అంటే చాలా ఇష్టం అని సూర్యోదయం ఫోటోను షేర్ చేసింది. ముఖ్యంగా ఓ నెటిజన్ బన్ని మిమ్మల్ని ఏమని పిలుస్తాడు ? నిక్ నేమ్ ఏమైనా ఉందా ? అని ప్రశ్నించగా.. బన్ని తనను క్యూటీ అని పిలుస్తాడని సీక్రెట్ చెప్పిసింది స్నేహారెడ్డి. మరోవైపు నూతన సంవత్సరానికి ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నారా? పాటించాలనుకుంటున్నారా ? అని మరో నెటిజన్ అడగగా.. ఈ ప్రశ్నకు స్నేహారెడ్డి వింతగానే సమాధానం చెప్పింది. అయాన్ తో కలిసి కిచెన్ వంట వండాలని అనుకుంటున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం స్నేహారెడ్డి చేసిన ఈ చిట్ చాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం విశేషం.