Home » పాన్ ఇండియా సినిమాల పై రవితేజ సెటైర్ లు….బొక్క‌బోర్లా ప‌డ‌తారంటూ!

పాన్ ఇండియా సినిమాల పై రవితేజ సెటైర్ లు….బొక్క‌బోర్లా ప‌డ‌తారంటూ!

by AJAY
Ad

మాస్ మ‌హరాజ్ ర‌వితేజ కచ్చితంగా ఏడాదికి ఒక‌టి రెండు సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌కు ట్రీట్ ఇస్తుంటాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ ధ‌మాక ఈ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టించ‌గా న‌క్కిన త్రినాథ‌రావు ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న రవితేజ రీసెంట్ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు.

Advertisement

పాన్ ఇండియా సినిమా అంటే సినిమాను భారీ లెవ‌ల్ లో విడుద‌ల చేయ‌డం కాద‌ని అన్నాడు. ఎప్పుడైతే మ‌నం చేస్తున్న సినిమాలో కంటెంటె ఉంటుందో ఆ క‌థ‌లో పాన్ ఇండియా రేంజ్ లో ఉంటుందో అప్పుడే పాన్ ఇండియా సినిమా అవుతుంద‌ని చెప్పారు. సినిమా క‌థ‌లో కంటెంట్ లేక‌పోయినా ఆ సినిమాను భారీగా పాన్ ఇండియా లెవ‌లో విడుద‌ల చేస్తే బొక్క బోర్లా ప‌డ‌తాయ‌ని కామెంట్స్ చేశారు.

Advertisement

raviteja

raviteja

ఇదిలా ఉంటే ర‌వితేజ చేసిన కామెంట్స్ ప‌రోక్షంగా కొంత‌మంది హీరోలను అంటూ ప‌లువురు నెటిజ‌న్ లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ మ‌ధ్య ప్ర‌తి సినిమాను డ‌బ్బులు ఖ‌ర్చు చేసి అన‌వ‌స‌రంగా ప్ర‌మోష‌న్స్ చేస్తూ బొక్క బోర్లా ప‌డిన హీరోల గురించే ర‌వితేజ కామెంట్స్ చేశార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

raviteja

raviteja

ఇదిలా ఉంటే ర‌వితేజ ఇప్ప‌టి వ‌ర‌కూ పాన్ ఇండియా సినిమాలో న‌టించ‌లేదు. చాలా మంది చిన్న హీరోలు సైతం త‌మ సినిమాల‌ను అన్ని భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నా ర‌వితేజ కేవ‌లం తెలుగులోనే విడుద‌ల చేస్తున్నాడు. కానీ ర‌వితేజ‌కు విక్ర‌మార్కుడు సినిమాతో సౌత్ తో పాటూ బాలీవుడ్ లో కూడా క్రేజ్ వ‌చ్చింది. దాంతో ఆయ‌న పాన్ ఇండియా సినిమాలు చేయాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading