Home » న్యూయ‌ర్ లోపు అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెడ‌తా.. కాస్టింగ్ కౌచ్ పై క‌ల్పిక గ‌ణేష‌న్ సెన్సేషన‌ల్ కామెంట్స్..!

న్యూయ‌ర్ లోపు అంద‌రి పేర్లు బ‌య‌ట‌పెడ‌తా.. కాస్టింగ్ కౌచ్ పై క‌ల్పిక గ‌ణేష‌న్ సెన్సేషన‌ల్ కామెంట్స్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో రానిస్తున్న తెలుగ‌మ్మాయిల‌లో క‌ల్పిక గ‌ణేష్ కూడా ఒక‌రు. హైద‌రాబాద్ కు చెందిన క‌ల్పిక మోడ‌లింగ్ ఫీల్డ్ లో అడుగుపెట్టి ఆ త‌రవాత సినిమాల్లో ట్రై చేసింది. ఈ క్ర‌మంలోనే చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ప్ర‌యాణం సినిమాలో ఆఫ‌ర్ ను అందుకుంది.ప్ర‌యాణం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంతే కాకుండా ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో ముఖ్య‌మైన పాత్ర‌ల‌లో న‌టించింది. రీసెంట్ గా య‌శోద సినిమాలోనూ ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించింది.

Advertisement

ఇదిలా ఉంటే కొంత‌కాలంగా క‌ల్పిక సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టులతో వార్త‌ల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ న‌గ‌రానికి ఏమైంది సినిమా క‌మెడియ‌న్ అభిన‌వ్ గోమ‌తం తో జ‌రిగిన గొడ‌వ గురించి చెబుతూ సోషల్ మీడియాలో వ‌రుస పోస్ట్ లు పెట్టింది. ఇక రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో క‌ల్పిక సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. కోలీవుడ్ లో ఎక్కువ కాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ క‌ల్పిక ఆరోపించింది.

Advertisement

నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే కానీ తొంద‌ర‌గా అందులో నుండి బ‌య‌ట‌ప‌డ్డాను అని చెప్పింది. కోలీవుడ్ కు చెందిన ధ‌నుష్‌, అనిరుద్, బాలాజీ ల పేర్లు గ‌తంలో భ‌య‌ట‌కు వ‌చ్చాయని సుచీ లీక్స్ పేరుతో చాలా పేర్లు భ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని వ్యాక్యానించింది. కానీ ఆ ఇండ‌స్ట్రీలో సింగ‌ర్ సుచిత్ర‌ను కనుమ‌రుగ‌య్యేలా చేసి ఆ ఇష్యూను క‌నుమ‌రుగు అయ్యేలా చేశార‌ని పేర్కొంది.

అంతే కాకుండా ఆ త‌ర‌వాత సింగ‌ర్ చిన్మ‌యి కూడా కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిందని పేర్కొంది. ఆ ఇష్యూలో చిన్మ‌యిని కూడా చాలా స‌ఫ‌ర్ చేశార‌ని చెప్పింది. తాను కూడా ఈ విష‌యంలో బాధ‌ప‌డ్డాన‌ని న్యూయ‌ర్ పార్టీ లోపు రోజుకు ఒక‌టి పేరు భ‌య‌ట‌పెడ‌తాన‌ని కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఎవ‌రికీ బ‌య‌ప‌డేది లేదు అంటూ స్ప‌ష్టం చేసింది.

Visitors Are Also Reading