భారతదేశాన్ని బ్రిటీషర్లు దాదాపు 200 సంవత్సరాలకు పైగా పరిపాలించారు. తొలుత వర్తక వ్యాపారం చేస్తామంటూ భారతదేశంలోకి అడుగుపెట్టారు. ఇక ఆ తరువాత భారతదేశాన్నే తమ ఆధీనంలోకి తీసుకొని మొగల్ రాజవంశీయులు రకరకాల రాజవంశాలపై యుద్ధం చేసి భారతీయులపై పెత్తనం చెలాయించారు. ఈ తరుణంలోనే భారతదేశాన్ని బ్రిటీషు వారు పాలించిన సమయంలో భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. దేశంలో ఎన్నో కట్టడాలు, బ్రిడ్జిలు నిర్మాణాలు జరిగాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే సంస్థల్లో ఒకటిగా ఇప్పటికే పేరుపొందిన భారతీయ రైల్వే వ్యవస్థ. అప్పటలో బ్రిటీషు వారి పాలనలోనే దీని స్థాపనకు పునాది పడింది.
Advertisement
ముఖ్యంగా భారత ఆర్థిక ఖజానాకు వెన్నెముక రైల్వే అని అందరికీ తెలుసు. భారత్ లో రైల్వే వ్యవస్థ తీసుకురావడంలో అభివృద్ధి చేయడంలో బ్రిటీషర్లు కీలక పాత్ర పోషించారు. భారతదేశంలో ఇంగ్లీషు భాష కూడా బ్రిటీషు వారి వల్లనే చాలా మంది నేర్చుకున్నారు. అప్పటివరకు భారతీయ సంస్కృతిలో భాగంగా కొన్ని వర్గాలు మాత్రమే చదువుకునే పరిస్థితి ఉండగా.. బ్రిటీషర్స్ పాలనలో పరిపాలన సౌలభ్యం కోసం ఇంగ్లీషు ప్రతీ ఒక్కరికీ నేర్చుకునేవిధంగా పరిస్థితులను కల్పించారు. దీంతో భారతీయుల్లో జ్ఞానం, ఆలోచన విధానాన్ని మెరుగుపరచడంలో ఇంగ్లీషు భాష ఎంతగానో సహాయపడింది.
Advertisement
ప్రపంచంలోనే నాలుగో అత్యంత శక్తిమంతమైన సైన్య ఇండియన్ ఆర్మీ. ఇది కూడా బ్రిటీష్ ఈష్ట్ ఇండియా కంపెనీ వారి ఆధ్వర్యంలో పునాది పడింది. అత్యంత శక్తిమంతమైన ఆర్మీగా భారత ఆర్మీకి పేరు ఉంది. ఆతరువాత భారత్ లో టీకాలు కూడా అభివృద్ధి పరచడంలో అప్పటి బ్రిటీషర్లు పోషించిన పాత్ర వల్లనే ఇప్పటికీ ప్రపంచానికే టీకాలు సరఫరా చేయడంలో భారత్ పెద్దన్ పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలోనే పలు ప్రమాదకరమైన వ్యాధులకు భారత్ ద్వారా అందించిన టీకాల వల్లనే చెక్ పెట్టడం జరిగిందట. ఈ రకంగా బ్రిటీషర్లు భారతదేశానికి ఎన్నో అద్భుతమైన మేలు చేశారు. వారు చేసిన పలు అభివృద్ధి పనులను అసలు మరిచిపోలేము.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
స్వాతంత్రం అంటే ఎవరో ఇచ్చే కాదు.. లాక్కునేది.. ఆసక్తి రేపుతున్న స్పై మూవీ ట్రైలర్