బ్రహ్మంగారు ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో కాలజ్ఞానం రాసారు. ఆవుల చుట్టూ గీత గీసి రవ్వలకొండలో కాలజ్ఞాన రచన గావించారు బ్రహ్మంగారు. రవ్వలకొండ బనగానపల్లెకు 1.5 కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఉన్నది. ఈ కొండ గుహాల్లో కూర్చొని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు కనుక కొండలను బ్రహ్మంగారి కొండలు అని పిలుస్తారు.
Advertisement
ఈయన భవిష్యత్‌లో జరిగే అనేక సంఘటనలను, విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో భద్రపరిచారు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలను ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే..! ఆయన రాసిన కాలజ్ఞానం ఎక్కడ ఉంది..? వ్యక్తిగతంగా ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏమిటి..? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read : ప్రణతి బర్త్ డే రోజు చరణ్ నేను షికారుకెళతాం…ఎన్టీఆర్ ఇంట్రెస్టింట్ కామెంట్స్..!
పోతులూరి కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకచోట పాతి పెట్టారు. ఆ తరువాత దానిపైన చింతచెట్టు మొలిచింది. ఆయన కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు. ఇలా ఎందుకు చేశారు. అనే దానికి మాత్రం ఇప్పటివరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన కొన్ని నిజాలు ఏమిటంటే.. కాశీలోని దేవాలయం నలబై రోజులు పాడుపడుతుంది అని చెప్పాడు.
ఆయన చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీని వల్ల ఆ సమయంలో కాశీ పుణ్యక్షేత్రం సందర్శించేందుకు భక్తులెవ్వరూ వెళ్లలేదు. రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి ఇప్పుడు భారతదేశంతో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అంబ పదారు సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇందిరాగాంధీ పదహారు సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధాని మంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి.
ఇప్పటివారికి తెలియదు. కానీ, వంద సంవత్సరాల కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వందల ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడా అగ్రహారాలు లేవు. జన సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుక్కోలేదు.
Advertisement
రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళలు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు మొదలయ్యాయి. నీళ్లతో దీపాలను వెలిగిస్తారు. ప్రస్తుతం నీటి నుంచే విద్యుత్ వస్తోంది. ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి వందల ఏళ్ల కిందటే బ్రహ్మంగారు చెప్పారు. గట్టివాడయిన పొట్టివాడొకడు దేశాన్ని పాలిస్తాడు. ఇప్పటివరకు దేశాన్ని పాలించిన ప్రధానుల్లో పొట్టివాడయిన లాల్ బహదూర్ శాస్త్రీ సమర్థవంతమైన పాలనను అందించారు. కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారు. ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా ప్రజలను మోసం చేస్తున్నారు.
Also Read : ఐపీఎల్ కు పాకిస్తాన్ సవాల్.. ఎవరు ఆడతారో చూస్తామంటూ..!
వేశ్యల వల్ల ప్రజలు భయంకర రోగాలకు గురవుతారు. వావీ వరసలు లేకుండా మనుషులు మృగాళ్ల ప్రవర్తిస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి ముందే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. అక్రమ సంబంధాలు ఇటీవల విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పాడు. బ్రహ్మంగారు చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశంలోని ప్రజలు చాలా సంవత్సరాలు బానిసలుగా బ్రతికారు.
ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు జరగనవి, రాబోవు రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానం లో ఏమని ఉందంటే.. కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కు పుడకను అందుకుంటుంది అని ఉంది. ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకిలాద్రిని తాకే ప్రమాదం ఉంది. ఐదువేల సంవత్సరాల తరువాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది. దీనిపైన భిన్న వాదనలు ఉన్నాయి. చెన్నకేశవస్వామి మహిమలు నాశనమైపోతాయి. ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పుడుతుంది. దానిని చూసిన వారికి ఆ కాంతివల్ల కనులు కనబడవు గుడ్డి వారు అవుతారని ఉంది.
పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులుండి, భ్రమరాంబ గుడిలో దూరి మేకపోతు వలే అరిచి మాయమౌతుందని చెప్పాడు. కలియుగాన 5000 సంవత్సరం పూర్తయ్యే కాలానికి కాశీ గంగ కనబడదు. బెంగళూరు కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుంది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుంచి రాళ్లు దొర్లిపడి జననష్టం జరుగుతుంది. పగిలిన రాతిముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని చెప్పారు.
ఇక బ్రహ్మంగారి ఆయన జన్మ రహస్యం గురించి ఐదువేల ఏళ్ల తరువాత నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారం దాల్చి మళ్లీ జన్మిస్తాను. ఈ సంఘటన జరగడానికి ముందు అనేక ఉత్పాతాలు విపరీత సంఘటనలు కనిపిస్తాయి. కాశీ అవతల గండకినదిలో సాలగ్రామములు నాట్యమాడతాయి. మనుషులతో మాట్లాడతాయని చెప్పారు. ఇలా భవిష్యత్‌ను ముందే ఊహించి రాసిన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది తెలీదు. ఎలా ఉన్న కానీ విధి ప్రకారం.. జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే.
Also Read : RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన..!