Home » ప్ర‌ణ‌తి బ‌ర్త్ డే రోజు చ‌ర‌ణ్ నేను షికారుకెళ‌తాం…ఎన్టీఆర్ ఇంట్రెస్టింట్ కామెంట్స్..!

ప్ర‌ణ‌తి బ‌ర్త్ డే రోజు చ‌ర‌ణ్ నేను షికారుకెళ‌తాం…ఎన్టీఆర్ ఇంట్రెస్టింట్ కామెంట్స్..!

by AJAY
Ad

ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా జ‌క్క‌న్న తెర‌కెక్కించిన మ‌ల్టీ స్టార‌ర్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా మార్చి 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. దాంతో సినిమా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల‌ను చిత్ర యూనిట్ ష‌ర‌వేగంగా జ‌రుపుతోంది. అయితే తాజాగా సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ యూనిట్ ను అనిల్ రావిపూడి ఇంట‌ర్వ్యూ చేశారు.

Advertisement

ఈ ఇంట‌ర్వ్యూలో ఎన్టీఆర్ ఆసక్తిక‌ర విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. తాను మంచి న‌టుడిగా మార‌డానికి రాజ‌మౌళినే కార‌ణ‌మ‌ని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండ‌టానికి కార‌ణం ఆయ‌నే అని చెప్పారు. త‌న‌ను విమ‌ర్శించేది ఇద్ద‌రు వ్య‌క్తులే కాగా అందులో ఒక‌రు త‌న తండ్రి హ‌రికృష్ణ రెండోది రాజ‌మౌళి అని చెప్పారు. అంతే కాకుండా రామ్ చ‌ర‌ణ్ తో త‌న‌కు ఉన్న బాండింగ్ గురించి కూడా తార‌క్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

Advertisement

rrr movie ram charan

త‌న భార్య ప్ర‌ణ‌తి పుట్టిన రోజు మార్చి 26 అని అర్థ‌రాత్రి 12 దాటిన త‌ర‌వాత అంటే మార్చి 27న చ‌ర‌ణ్ కారు త‌న గేటు వ‌ద్ద ఆగుతుంద‌ని చెప్పాడు. ఆ త‌ర‌వాత చ‌ర‌ణ్ కారులో షికారుకు దూసుకెళ‌తామని ఎన్టీఆర్ వెల్ల‌డించారు. ఈ విష‌యం త‌మ‌కు త‌ప్ప ప్ర‌పంచానికి తెలియద‌ని అన్నారు. చ‌ర‌ణ్ బ‌య‌ట‌కు ఎంతో కూల్ గా కనిపిస్తాడ‌ని కానీ లోప‌ల చాలా ఫైర్ ఉంటుంద‌ని అన్నారు. చ‌ర‌ణ్ ద‌గ్గ‌ర అదే త‌న‌కు బాగా న‌చ్చింద‌ని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

Visitors Are Also Reading