సినీ ప్రేక్షకులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25న విడుదల కానున్నది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై..ప్రివ్యూ షోల విషయమై ముఖ్యమంత్రి జగన్‌తో రాజమౌళి చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన విషయం తెలిసినదే. సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పాడు.
ఇవాళ ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేసారు. వంద కోట్ల బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు. సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆ దరఖాస్తుపై సీఎం జగన్ సంతకం పెట్టున్నారు. హీరో, హీరోయిన్ డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి మాత్రమే 100 కోట్ల బడ్జెట్ పెడితే.. ఆ సినిమాలకు సినిమా విడుదలైన 10 రోజులు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించాం. దానికి ముందుగా నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంతేకాదు.. ప్రజలకు భారం పెంచే విధంగా కాకుండా సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా చేయాలని, ఆన్‌లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారు అయ్యాయని ఆ విధానం కూడా త్వరలో రానుందని తెలిపారు.
Also Read : COVID 19 : మరొక కొత్త వేరియంట్.. భారత్‌లో కూడా కలవరం..!