Home » సానియా మీర్జా ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

సానియా మీర్జా ఆస్తుల విలువ ఎంతో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు ఇప్పుడు ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. ఓ మాములు క్రీడాకారిణిగా ప్రారంభించిన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయికి చేరింది. ఎన్నో టైటిళ్స్ సొంతం చేసుకుంది. అదే సమయంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‏ను ప్రేమ వివాహం చేసుకుంది. 2010లో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 14 సంవత్సరాలపాటు వీరి వైవాహిక బంధం కొనసాగింది. ఆ తర్వాత కొన్నాళ్లు వీరిద్దరు విడివిడిగా ఉన్నారు. దీంతో సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి.

sania-mirza-assets

Advertisement

 

అయితే ఆ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఇటీవల షోయబ్ మాలిక్ పెళ్లి ఫోటోస్ బయటకు రావడంతో వీరిద్దరి విడాకుల వార్తలు నిజమే అని కన్ఫార్మ్ అయ్యింది. పాకిస్తాన్ దేశానికి చెందిన ప్రముఖ నటి సనా జావేద్‍ను వివాహం చేసుకున్నాడు షోయబ్. ప్రస్తుతం సానియా తన కుమారుడు ఇజాన్‏తో కలిసి దుబాయ్‏లో నివసిస్తుంది.  అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో సనా జావేద్, సానియా, షోయబ్ ల గురించి అన్నీ ట్రెండింగ్‏లో ఉన్నాయి. ఈ క్రమంలోనే సానియా మీర్జా విలాసవంతమైన జీవనశైలిని.. ఆమె కార్ల సేకరణతో పాటు మిగతా విషయాల గురించి సెర్చ్ చేస్తున్నారు.

2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తరువాత సానియా మీర్జా ఆటకు రిటైర్ మెంట్ ప్రకటించింది. అప్పటికీ సానియా వ్యక్తి గత సంపద 26 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు 210 కోట్లు అన్నమాట.  ఆమె వద్ద రేంజ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, BMW వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుంది. BMW 7-సిరీస్, జాగ్వార్ XF, రేంజ్ రోవర్ ఎవోక్, పోర్స్చే కయెన్ కార్లు ఉన్నాయి.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading