Home » ఒక్క‌డు సినిమాను వ‌దులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో మీకు తెలుసా..?

ఒక్క‌డు సినిమాను వ‌దులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో మీకు తెలుసా..?

by Anji
Ad

సినీ ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఒక హీరో వదులుకున్న సినిమాలో మరొక హీరోగా నటించి సక్సెస్ సాధించిన సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక హీరోయిన్ వదులుకున్నా సినిమాల్లో మరొక హీరోయిన్ నటించి సక్సెస్ సాధించిన సందర్భాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటైనా ఒక్కడు సినిమా గురించి అందరికీ తెలిసిందే.

Advertisement

దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఎం.ఎస్.రాజు నిర్మాతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల 7డేస్ 6 నైట్స్ ప్రమోషన్ లో భాగంగా ఎం.ఎస్‌. రాజు మాట్లాడుతూ.. మనసంతా నువ్వే సినిమా కు తొలుత‌ భూమికను హీరోయిన్ గా అనుకున్నామని.. భూమికకు మనసంతా నువ్వే, ఒక్కడు సినిమాల‌ కథలు చెప్పగా ఒక్కడు నచ్చిందని.. రీమాసేన్ కు కూడా ఈ రెండు కథలు చెప్పగా మనసంతా నువ్వే నచ్చిందని ఎం.ఎస్‌. రాజు వెల్లడించారు.

Advertisement

ఒక్కడు సినిమాలో రీమాసేన్, మనసంతా నువ్వే లో భూమిక ఛాన్స్ కోల్పోయారు అని ఎం. ఎస్. రాజు చెప్పుకొచ్చారు. ఖుషి, సింహాద్రి, ఒక్కడు సినిమాల విజయాలతో భూమిక రేంజే మారిపోయింది. ముగ్గురు స్టార్ హీరోల స‌క్సెస్ పుల్ సినిమాల్లో హీరోయిన్గా భూమిక నటించారు. ఈ సినిమాలు ఆహా హీరోలందరికీ ఏడవ సినిమాలు కావడం గ‌మ‌నార్హం. లక్కీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న భూమిక వరుస‌ ఆఫర్లను సాధించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి. భూమిక వరుస ఆఫర్ లను సొంతం చేసుకున్న ఈ విషయంలో మాత్రం తప్పటడుగులు వేశారు. ప్రాజెక్టుల ఎంపిక విషయంలో చేసిన పొరపాట్ల వల్ల భూమిక ఎక్కువకాలం కెరీర్ ను కొనసాగించలేదు. భూమిక ఓ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. కానీ ఆ చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు. ప్రస్తుతం భూమిక అక్క, వదిన వంటి పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : 

ప‌భోజ‌న్ గోల్డ్ టీ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

 

Visitors Are Also Reading