Home » రవితేజని చూసి భయపడిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

రవితేజని చూసి భయపడిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

మాస్ మహారాజా రవితేజ చూసి మరో స్టార్ హీరో భయ పడడం ఏంటి అని మీరందరూ షాక్ అవుతున్నారు కదూ..అయితే ఒకప్పుడు రవితేజను చూసి మరో స్టార్ హీరో నిజంగానే భయపడ్డారట.. మరి ఇంతకీ రవితేజని చూసి అంతగా భయపడ్డ ఆ హీరో ఎవరు? ఎందుకు అలా భయపడాల్సి వచ్చింది.. అనే విషయాలను  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

రవితేజ కి మాస్ మహారాజా ఇమేజ్ వచ్చింది ఇడియట్ సినిమాతో.. ఈ సినిమాతో రవితేజకి ఎక్కడలేని స్టార్డం వచ్చింది. ఇక ఈయన ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో హీరోగా నటించారు.అయితే అలాంటి రవితేజ రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు  సినిమాలో హీరో గా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ రెండు పాత్రల్లో చేసి అదరగొట్టారు.ఒక పాత్రలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్ గా మెప్పించారు. మరో పాత్రలో దొంగగా నటించారు.

ఇక ఈ రెండు పాత్రల్లో కూడా రవితేజ పూర్తిగా లీనమైపోయి నటించారని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా ఆఫర్ ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి వచ్చిందట. అయితే సినిమా స్టోరీ మొత్తం విన్నాక రాజమౌళి చెప్పిన స్టోరీ బాగానే ఉంది కానీ ఈ సినిమాలో చేయడం నావల్ల కాదు అంటూ పక్కన పెట్టేసారట. ఇక ఈ స్టోరీని రాజమౌళి రవితేజ కి చెప్పగా ఆయనకు బాగా నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఇక చివరికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ అయ్యాక ఈ సినిమా చూసిన పవన్ కళ్యాణ్ కి సినిమాలో రవితేజ నటించిన తీరుకి ఆయన ఆశ్చర్య పోయారట.అంతేకాదు ఈ సినిమాలో రవితేజ అంతా బాగా ఎలా నటించారా అని ఆయనను తలుచుకొని రెండు రోజుల వరకు నిద్రపోకుండా భయపడ్డారట. అలా ఫస్ట్ టైం రవితేజ నటించిన సినిమా చూసి పవన్ కళ్యాణ్  భయపడిపోయారట.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading