Home » దేశముదురు మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా ?

దేశముదురు మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో మీకు తెలుసా ?

by Anji

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా ఆయన నటించిన గంగోత్రి నుంచి పుష్ప వరకు దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ సాధించాయనే చెప్పవచ్చు. వీటిలో ఒకటి రెండు మినహా.. అల్లు అర్జున్ నటించిన దేశముదురు మూవీ అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది.  ఈ సినిమాలో బన్నీ స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఈ మూవీతోనే హన్సిక హీరోయిన్ గా పరిచయమైంది. 

హన్సిక అందానికి క్యూట్ నెస్ కి ప్రేక్షకులందరూ ఫిదా అయ్యారు. 2007లో వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. 2007లో 400 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీగా వసూలు సాధించింది. దేశముదురు సినిమాలో సీనియర్ హీరోయిన్ రంభ ఓ స్పెషల్ సాంగ్ లో మెప్పించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్స్ తో అదురగొట్టాడు. 

Sumanth

దేశముదురు చిత్రానికి చక్రీ అందించిన సంగీతం ఈ మూవీని వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలిచింది. అదేవిధంగా దర్శకుడు పూరిజగన్నాథ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకులచే విజిల్స్ కొట్టించాయి. ఈ మూవీలో వాస్తవానికి ఫస్ట్ అల్లు అర్జున్ ని హీరోగా అనుకోలేదట దర్శకుడు పూరిజగన్నాథ్. తొలుత ఈ సినిమా కథను అక్కినేని హీరో సుమంత్ కోసం కథను రాసుకున్నారట. ఈ కథను విన్న తరువాత సుమంత్ కి ఈ కథ నచ్చలేదట. దీంతో ఆయన తిరస్కరించాడట. ఆ తరువాత అదే కథను అల్లు అర్జున్ కి చెప్పగానే ఓకే చెప్పేశారట. అలా దేశముదురు మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు అల్లు అర్జున్. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 పెళ్లికి ముందే వరుణ్ తేజ్ కు లావణ్య కండిషన్స్..అవి ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఉపాసన జతకంపై జ్యోతిష్యుడు సంచలన వ్యాఖ్యలు… చరణ్ కు కొడుకు పుడితే జరిగేది ఇదే ?

Visitors Are Also Reading