Home » శృతిహాసన్ అక్కడ టాటూ వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

శృతిహాసన్ అక్కడ టాటూ వేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

నటి శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె ఎప్పుడు అయిన ఓ  సంచలనమే అని చెప్పవచ్చు. లోక నాయకుడు కమలహాసన్ వారసురాలు అయిన ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో ఉండడానికి ప్రయత్నిస్తారని చెప్పవచ్చు. హిందీ చిత్రం లక్ ద్వారా కథానాయకగా పరిచయమైనా, ఆ తర్వాత దక్షిణాది చిత్రాలకే పరిమితమయ్యారు.

Advertisement

అలా ధనుష్ కి జోడీగా 3, సూర్య జంటగా 7 ఆమ్ అరువు వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. అయితే ఈ బ్యూటీ ఎక్కువగా విజయాలను అందుకున్నది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే. తాజాగా ప్రభాస్ కు జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం సలార్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ చిత్రం కోసం యావత్ సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. సలార్ చిత్రం డిసెంబర్ 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబు అవుతోంది. కాగా ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న శృతిహాసన్ నెటిజన్లను ఖుషి చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి వార్తల్లో నిలిచారు.

Advertisement

తాజాగా ఆమె పేరుతో కూడిన టాటూను ఒంటిపై కనిపించేలా తీసుకున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అందులో తాను అన్నింటిని మరిచి బయటకు రావాలని కోరుకుంటున్నానని, ఇకపై తాను లేచి నిలబడడం నేర్చుకుంటున్నానని పేర్కొన్నారు. తన విషయాలను తన స్టైల్ లో చేస్తానని ఇది తన రహదారి లేదా బైపాస్ అని శృతిహాసన్ పేర్కొన్నారు. దీంతో శృతిహాసన్ మాటల్లో అర్థం ఏమిటి? రామా అంటూ ఆమె అభిమానులు బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading