Home » ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా ?

ప్రాణ స్నేహితులుగా ఉన్న ఎన్టీఆర్-ఏఎన్నార్ మధ్య గ్యాప్ రావడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలో అక్కినేని ఫ్యామిలీ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బాలయ్య అక్కినేని, తొక్కినేని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు అక్కినేని అభిమానులు బాలకృష్ణపై మండిపడుతున్నారు. ఈ రెండు కుటుంబాల మధ్య మళ్లీ గ్యాప్ వచ్చిందా..? అనే చర్చ కూడా మొదలైంది. సినీ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలుగా పేరు ఉన్నటువంటి నందమూరి, అక్కినేని ఫ్యామిలీ మధ్య మొదటి నుంచి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ అన్న, తమ్ముడని పిలుచుకునేవారు.

Advertisement

 

టాలీవుడ్ లో వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలకు దిశా నిర్దేశం చేశారు. ఇద్ధరి మధ్య సినిమా పరంగా ఎంత పోటీ ఉన్నా కూడా పదుల సంఖ్యలో మల్టీస్టారర్ సినిమాలు చేశారు. వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. ఒకానొక సమయంలో ఏదో విషయంలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ చాలా ఏళ్ల పాటు కొనసాగింది. ఎన్టీఆర్ తో వచ్చిన గ్యాప్ గురించి ఏఎన్నార్ స్వయంగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి ఇలా మాట్లాడారు. “ మేమిద్దరం సత్యం శివం సినిమాలో పని చేస్తున్నాం. మబ్బుల కారణంగా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. నేను అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు, ఎన్టీఆర్ కూర్చొని ఉన్నాం. ఎన్టీఆర్ ఆ సమయంలో పేపర్ చదువుతున్నాడు.

Advertisement

  అప్పుడు ఆయన “బ్రదర్ మన ఇద్దరం రాజకీయాల్లోకి వెళ్దాం” అని అన్నారు. అప్పుడు నేను సినిమాల్లో ఉంటే ఎవ్వరికీ విరోధం కాదు..  కానీ రాజకీయాల్లో అయితే  విరోధం అవుతాం. నేను పాలిటిక్స్ కి పనికి వస్తాను. కానీ నువ్వు పనికి రావు అని చెప్పాను. ముఖ్యంగా నువ్వు ఆవేశపరుడివి.. ఎలా పడితే అలా మాట్లాడుతావు. నేను ఎంత చెప్పినా వినలేదు. ఆ, ఊ అంటావు.. వద్దు అన్నాను నేను. ఓ సారి మా కుటుంబాన్ని భోజనానికి ఇంటికి పిలిచాడు. అప్పుడు కూడా నాతో మరోసారి రాజకీయాల గురించి చర్చించాడు. ఏదో ఒకటి డిసైడ్ కావాలన్నాడు. నువ్వు కావాలంటే వెళ్లు.. నా ఆరోగ్యం బాగోలేదు అని, డబ్బు లేదని.. ఉన్న డబ్బు మొత్తం స్టూడియోకి పెట్టాను అని చెప్పాను. ఇక ఆ తరువాత ఓ సినిమా షూటింగ్ లో మరోసారి అడిగాడు ఎన్టీఆర్. అప్పుడు కూడా నేను రాను అని చెప్పేశాను.  ఇక ఆ తరువాత ఓ శ్లోకం విషయంలో మా ఇద్దరి మధ్య కొంత మంది మంట పెట్టారు. 

Also Read :  “అక్కినేని తొక్కినేని” అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై అన్నాదమ్ముల కౌంటర్…మామూలుగా ఇవ్వలేదుగా…!

Manam News

ఎన్టీఆర్ సీఎం అయిన తరువాత అన్నపూర్ణ స్టూడియో విషయంలో కూడా మా మధ్య గ్యాప్ వచ్చింది. దీంతో ఎన్టీఆర్ తో నేను మాట్లాడటం మానేశాను. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటికీ  నేను ఆయనను పట్టించుకునే వాడిని కాదు..  కానీ లక్ష్మీపార్వతితో పెళ్లి జరిగిన తరువాత.. సినిమా వారిందరితో పాటు నన్ను కూడా భోజనానికి పిలిచారు. అప్పుడు మేమిద్దరం కలిసిపోయాం. ఆ తరువాత ఎన్టీఆర్ దంపతులను నేను భోజనానికి పిలిచాను. స్టూడియో విషయంలో నేనే గెలిచాను. ఈ విషయంపై కోర్టుకు వెళ్లి నేను విజయం సాధించాను” అని వెల్లడించారు ఏఎన్నార్. ఇలా ఈ రెండు కుటుంబాలు మళ్లీ కలిసిపోయాయి. ఆ తరువాత మళ్లీ ఈ రెండు ఫ్యామిలీల మధ్య గ్యాప్ వచ్చినట్టు తెలుస్తోంది. గత కొద్ది సంవత్సరాలుగా బాలకృష్ణ, నాగార్జున ఇద్దరూ కలిసి ఏ వేదికపైన కూడా కనిపించిన దాఖలాలు లేవు. ఈ తరుణంలోనే బాలయ్య అక్కినేని, తొక్కినేని అని పేర్కొనడం చర్చకు దారి తీసింది. దీనిపై తాజాగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా స్పందించారు.  

Also Read :  కమెడియన్ ఏవీఎస్ అల్లుడు కూడా నటుడు అనే విషయం మీకు తెలుసా..?

Visitors Are Also Reading